Leopard killed : ఆటో బ్రేక్ వైర్లతో చిరుతను చంపేశారు
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం వద్ద అ

seen from Hong Kong SAR China

seen from India

seen from United States

seen from China

seen from Austria
seen from United States
seen from United Kingdom

seen from United States

seen from Czechia

seen from Czechia
seen from Chile

seen from United States

seen from United States
seen from China
seen from Italy

seen from United States
seen from Yemen

seen from United States
seen from United Kingdom
seen from India
Leopard killed : ఆటో బ్రేక్ వైర్లతో చిరుతను చంపేశారు
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం వద్ద అ
Trinethram News : అన్నమయ్య జిల్లా:నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి..దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు..అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించిన పశుసంవర్ధక శాఖ వైద్యులు..
కన్న కొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్
కన్నకొడుకు కాదు.. వాడు కాలయముడు.. – ఆస్తులు పంచలేదని వృద్ధ దంపతులపై కన్నకొడుకు దాడిపై మహిళా కమిషన్ సీరియస్ – అన్నమయ్య జిల్లా ఘటన వీడియో వైరల్‌పై తీవ్రంగా స్పందించిన గజ్జల లక్ష్మి – కిరాతకుడిపై కఠిన చర్యలు కోరుతూ జిల్లా ఎస్పీతో మాట్లాడిన గజ్జల లక్ష్మి – బాధితులకు అండగా నిలవాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆదేశం ‼️అన్నమయ్య జిల్లాః ‼️ ఆస్తుల పంపకం వృద్ధ తల్లిదండ్రులకు శాపంగా మారింది. కన్నకొడుకే కాలయముడిలా మారాడు. నవమాసాలు మోసీ, కనీ పెంచిన తల్లిదండ్రు లపైనే అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్ధ దంపతుల్ని నోటికొచ్చినట్లు అసభ్యకరమైన బూతులు తిడుతూ ఇష్టానుసారంగా చేతులతో పిడిగుద్దు లు గుద్దుతూ.. కాళ్లతో ఎగిరెగిరి తన్నిన ఓ కొడుకు ఉన్మాదంపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనకు సంబం«ధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అయ్యి మహిళా కమిషన్ దృష్టికొచ్చింది. తక్షణమే స్పందించిన మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి గజ్జల లక్ష్మి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మదనపల్లె టౌన్ సీఐ యువరాజ్‌తోనూ మాట్లాడి.. వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనపై సీరియస్‌గా స్పందించాల న్నారు. సభ్యసమాజం తలదించుకునేలా క్రూరంగా దాడిచేసిన వైనంపై వీడియో వైరల్ కావడాన్ని చర్చించారు. దీనిపై సీఐ యువరాజ్ మాట్లాడుతూ.. మదనపల్లి టౌన్‌లోని అయోధ్య నగర్ ఏరియాలో ఆస్తి పంపకాల నేపథ్యంలో తనకు సరైన న్యాయం చేయలేదని లక్ష్మమ్మ, వెంకటరమణారెడ్డి దంపతులపై వారి చిన్న కొడుకు శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడినట్లు శనివారం బాధితులు ఫిర్యాదిచ్చారని చెప్పారు. వెంటనే ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని బాధిత తల్లిదండ్రులను ప్రభుత్వ ఆస్పత్రికి కూడా తరలించి చికిత్స చేయిస్తున్నామని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మికి ఆయన వివరించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపి.. అతనికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె పోలీసులను కోరారు. అదేవిధంగా స్థానిక ఆర్డీవోతో కూడా ఆమె మాట్లాడి సీనియర్ సిటిజన్ యాక్టు కింద వృద్ధ తల్లిదండ్రుల రక్షణ, భద్రతతో పాటు వారి పోషణకు సంబంధించిన ఏర్పాట్లుపై మానవీయ కోణంలో తక్షణ స్పందన అవసరమని గజ్జల లక్ష్మీ చెప్పారు. ఆస్తుల పేరిట కన్నతల్లిదండ్రులను వేధించే కర్కశ కొడుకులకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను గజ్జల లక్ష్మి కోరారు.
Read the full article
నేడు వెలికి తీయనున్న మృతదేహం
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లె-కర్ణాటక బార్డర్ మాలెపాడు దొనబైలు అడవిలో చంపి పాతిపెట్టిన శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు నేడు బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేయనున్నారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు గత నెల 28న అదృశ్య మయ్యాడు. అతడిని మండలంలోని మాలెపాడు దొనబైలుకు చెందిన ప్రసాద్ హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మృత దేహాన్ని కర్ణాటక బార్డర్‌లోని అడవిలో పాతినట్లు గురువారమే తెలుసుకున్నారు. శ్రీనివాసులు మృతదేహాన్ని శుక్రవారం తాలూకా సీఐ ఎన్ శేఖర్, టూ టౌన్ సీఐ యువరాజు లు సిబ్బందితో కలసి వెళ్లి వైద్యులతో స్పాట్ పిఎం చేయించ నున్నారు….
Read the full article
నాటు సారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Trinethram News : అన్నమయ్య జిల్లా, నిమ్మనపల్లె నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని అగ్రహారం గ్రామం, చింతపర్తి వారిపల్లికి చెందిన ఆర్. వెంకటరమణ (56) స్థానికులకు నాటు సారా విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. పక్కా సమాచారంతో వెళ్లి వెంకటరమణ ఇంట్లో సోదాలు జరపగా 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేయనుకుని సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు.
Read the full article
100 కేజీలు గంజాయి పట్టివేత
Trinethram News : అన్నమయ్య జిల్లా.. పిటీఎం మండలంలో 100 కేజీలు గంజాయి పట్టివేత… సిఐ తమ్మిశెట్టి మధు ఆద్వర్యంలో తనిఖీలు……
Read the full article
అంగన్వాడి కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి పై లైంగిక దాడి
Trinethram News : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం కమలామర్రిలోని పెద్దపల్లి గ్రామంలో అఘాయిత్యం అంగన్వాడీ కేంద్రం లోనే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి. కాసేపు ఇక్కడ ఉండు ఇంటికి వెళ్లి వస్తా అంటూ బావ రెడ్డెప్ప (55) కు చెప్పి వెళ్లిన విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ. అదును చూసుకొని బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డ రెడ్డెప్ప. బడి నుండి ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడం తో పోలీసులకు ఫిర్యాదు. వైద్య పరీక్షల నిమ్మితం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బాలికను తీసుకోచ్చిన కుటుంబ సభ్యులు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మానభంగం, ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుని కొరకు గాలింపు చర్యలు చేపట్టామని వివరాలు వెల్లడించిన డి ఎస్ పి మహబూబ్ భాష.
Read the full article
చెరువులో దూకి వివాహిత ఆత్మ హత్య
చెరువులో దూకి వివాహిత ఆత్మ హత్య అన్నమయ్య జిల్లా కుటుంబ కలహాలతో చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో బుధవారం వెలుగుచూసింది… ముదివేడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఆదినారాయణ కథనం మేరకు.. తెట్టు హరిజనవాడకు చెందిన మేకల ప్రసాద్ భార్య మేకల సుజాత( 38) విశ్వం కళాశాలలో పనిచేస్తోంది. ఈ నెల 19న కళాశాలకు వచ్చిన ఆమె సాయంత్రం ఇంటికి రాక పోవడంతో కుటుంబికులు చుట్టుపక్కల విచారించి జనవరి 21న ముదివేడు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఆదినారాయణ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బుధవారం అంగళ్ళు అక్కమ్మ చెరువులో సుజాత శవమై తేలింది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…
Read the full article