బిత్తిరిసత్తన్న.. ఈ బిత్తిరేశం ఏందన్నా..?
బిత్తిరిసత్తి టీవి9ను వదిలిపెట్టి(టీవీ9 వదిలించుకుందనేది ప్రచారంలో ఉన్న మాట) సాక్షి టీవీలో చేరిపోయారు. ఫాదర్స్ డే రోజు జరిగిన ఓ వివాదంతో ఇస్మార్ట్ న్యూస్ ప్రోగ్రాం నుంచి సత్తి వైదొలగాల్సి వచ్చింది. దీంతో కాస్త తక్కువ శాలరీ అయినా.. సాక్షి టీవీలో చేరిపోయారు. పవన్ ఫ్యాన్సా మజాకా… మీ తిక్కేంటో చూపించారు! శానిటైజర్ పై బాదుడు షురూ..! అయితే బిత్తిరి సత్తి అలియాస్ ఇస్మార్ట్ సత్తి అలియాస్ చేవెళ్ల రవి సాక్షిలో చేరిక వెనుక ఇరువురి ప్రయోజనాలున్నాయి. సత్తికి ఓ ప్లాట్ ఫాం కావాలి.. సాక్షి టీవీకి రేటింగ్ పెంచే ఓ వ్యక్తి కావాలి. అందుకే సత్తిని తీసుకుంది. సత్తికి కూడా వేరే ఛానళ్లలో ఆఫర్లు వచ్చాయట. కానీ కాస్త పెద్ద వ్యవస్థ అయితే బాగుంటుంది అని సాక్షిని సెలెక్ట్ చేసుకున్నారట. ఇంతరవకు అంతా బాగానే ఉంది. కానీ.. సాక్షి టీవీలో సత్తి ఎంట్రీ ఎలా ఉంటుంది అన్ని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆయన క్యారెక్టర్, కాస్ట్యూమ్.. ఎలా ఉంటాయి.. ఆయన శైలి ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తిగా ఉన్నారు. రాముడు భారతీయుడు కాదు : నేపాల్ ప్రధాని ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించే ముందు ఏ ఛానల్ అయినా.. ఓ ప్రోమో రిలీజ్ చేస్తుంది. అయితే సాక్షి కూడా సత్తితో ఓ ప్రోమో రిలీజ్ చేసింది. కానీ అది ప్రతీకారేచ్చతో ఉన్న ప్రోమో. తన తండ్రి ఫొటో పెట్టి స్కిట్ చేసినందుకు టీవీ9 సత్తిని బయటకు పంపించింది. ఇప్పుడు సాక్షికి వెళ్లిన సత్తి టీవీ9పై తన కోపాన్ని ప్రోమో ద్వారా బయటకు వదిలాడు. ఇది సాక్షి టీవీలో వచ్చే ప్రోగ్రాం ప్రోమో అనేకంటే.. సత్తి టీవీ9పై తన కోపాన్ని ప్రదర్శించే ప్రోమో అనడం బాగుంటుందేమో. నిజమే. బిత్తిరిసత్తికి టీవీ9లో అవమానం జరిగింది. ఫాదర్స్ డే రోజు తండ్రి ఫొటో పెట్టినంత మాత్రాన ఆయనను బయటకు పంపించేశారు. ఇది అవమానకరమైన విషయమే. Read the full article









