శరీరంలో వేడి క్షణాల్లో తగ్గాలంటే దీన్ని తాగండి ! How to reduce body heat immediately in Telugu
ఈరోజు మనం మన శరీరంలో వేడిని మన ఇంట్లో లభించే వాటితో సులభంగా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఒంట్లో వేడి కాదు ఇలా చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో వేడి చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. పైగా ఇది వేసవి ఎలాంటి సమయంలో శరీరంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో వేడి ఉంటే మలమూత్ర విసర్జన మంట అనిపిస్తుంది. శరీరంలో అధిక వేడికి అనేక కారణాలు ఉంటాయి. మన శరీరానికి తగినన్ని నీరు తాగకపోవటం.ఆధునిక ఆహారపు అలవాట్లు.మసాలా పదార్థాలు అధికంగా తినటం.బయట నూనే పదార్థాలు తినడం.చాలాసేపు కూర్చోని పనిచేయడం. మెంతులు ప్రతి ఇంట్లో ఉంటాయి మెంతులను ఆయుర్వేదంలో దేపనీమిత్రి అని అంటారు. ముదురు పసుపు రంగులో ఉండి గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ గింజల్లో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. ఈ గింజల్లో జిగురు చేదు రుచివల్లే మెంతులు మంచి ఔషధంలా ఆయుర్వేదం పేర్కొంటుంది. మెంతులతో తయారు చేసిన టీ తాగటం వల్ల మన శరీరంలో వేడి తగ్గటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు పోతాయి. ఈ మెంతుల టీ ని ప్రతిరోజూ టీ కాఫీ బదులు తాగడం వల్ల ఒంట్లో వేడి మటుమాయం అవుతుంది. మెంతులతో టీ తయారీ విధానం అర స్పూన్ మెంతులు తీసుకొని వాటిని దంచాలి. ఈ దంచిన మెంతులను గ్లాస్ నీటిలో వేసి నాలుగు లేదా ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మరిగించిన నీరు గోరువెచ్చగా అయిన తరువాత అందులో రుచికి తేనె లేదా పటిక బెల్లం చూర్ణం కలుపుకొని తాగాలి. ఇలా ప్రతి రోజు టీ కాఫీలకు బదులు తాగడం వల్ల మన శరీరంలో వేడి క్రమంగా తగ్గిపోతుంది. మెంతులలో పిండి పదార్థాలు పీచు పదార్థం, కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, థయమిన్, నియాసిన్ మెండుగా ఉంటాయి. ఇలా తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గటమే కాదు షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. పేగు పోత, కడుపులో మంట, రక్తహీనత తగ్గి పోతాయి. అధిక మద్యపానం వల్ల కాలేయం దెబ్బ తిన్నవారు ఇలా తాగడం వల్ల కాలేయం తిరిగి ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇలా తాగటం వల్ల మన శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. ఉపాధ్యాయులు ఉపన్యాసకులు పాటలు పాడేవారు ఇలా తాగటం వల్ల కంఠం మధురంగా మారుతుంది. ఘాత్రశుద్ధికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా త్రాగటం వల్ల పొట్ట మరియు పిట్టలో ప్రేగులు శుభ్రపడతాయి. శ్వాస సంబందిత సమస్యలు పోతాయి. ఇది శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది. శృంగార సమస్యలు ఉన్నవారు ఇలా తాగడం చాలా మంచిది. కాబట్టి మెంతులతో చేసిన టీ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. Read the full article
















