ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు అందరికీ సుపరిచితుడే.. పూరి జగన్నాథ్ సినిమాలకి ఆస్థాన సినిమాటోగ్రఫర్ పనిచేశాడు శ్యామ్.. అన్న ఛోటా ముక్కుసూటిగా మాట్లాడి పాపులర్ అయితే తమ్ముడు శ్యామ్ మాత్రం నెమ్మదస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కువగా శ్యామ్ ఆడియో ఫంక్షన్లలో మాట్లాడింది లేదు.. తన పనేదో తాను చేసుకుంటూ పోతాడు..
మొన్నటివరకూ పెద్దగా పాపులర్ కానీ శ్యామ్ ఇప్పుడు ఎక్కడ కూడా చూసిన తానే వినిపిస్తున్నాడు. కారణం అతనిపై సాయి సుధ అనే ఓ మహిళ చీటింగ్ కేసు పెట్టడం.. శ్యామ్‌తో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, 2015 నుంచి సహజీవనం చేస్తున్నామని సాయి సుధ హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మొదట్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పిన శ్యామ్ సహజీవనం చేస్తూ వస్తున్నాడని,ఇప్పుడు పెళ్లి చేసుకో అంటే మాత్రం స్పందించడం లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారని సాయి సుధ వాపోయారు. అంతేకాకుండా శ్యామ్ వాళ్ళ ఇంట్లో కూడా తమ మ్యాటర్ తెలుసు అని శ్యామ్ అన్నయ్య ఛోటా కూడా తమకి పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని,అయితే ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులు ఆగమన్నారని ఆమె వివరించారు.
ఇక ఇది ఇలా ఉంటే ఇంతకీ శ్యామ్ పైన కేసు పెట్టిన ఈ సాయి సుధ ఎవరు అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. సాయి సుధ ఫిజియోథెరపీ కోర్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు. నాలుగేళ్ల కోర్స్ పూర్తిచేసి డాక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆతర్వాత ఆమె దృష్టి డాక్టర్ నుంచి యాక్టర్ కి మారింది. ఇంట్లో వాళ్లు కూడా ఆమెని కొన్ని రోజులు పక్కన పెట్టారు.
ఆ తరవాత తమ కూతురు పోరాటం చూసి కూతురుని ప్రోత్సాహించారు. ఈ సమయంలోనే ఆమెకి శ్యామ్ తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. సాయి సుధ దమ్ము, బాడీ గార్డ్,అవును,ఎవరు ఇలా నలబై కి పైగా సినిమాలలో నటించింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ ఇంట్రడక్షన్ సన్నివేశంలో కనిపించే బోల్డ్ సన్నివేశంలో కనిపించేది సాయి సుధనే..
https://www.youtube.com/watch?v=FtH1egsm_vA
ఇక అప్పట్లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి పెద్ద యుద్దమే చేసింది కదా.. ఆ సమయంలోనే శ్రీ రెడ్డినే తప్పుబట్టింది సాయి సుధ.. అంతేకాకుండా తన సొంత సమస్యలతో ఇండస్ట్రీ అంతా బ్యాడ్ అని శ్రీరెడ్డి క్రియేట్ చేసిందని సాయి సుధ అభిప్రాయపడింది.
Also Read : మ్యాట్రిమోనీలో వల వేసింది.. 65 లక్షలు గుంజింది!
Read the full article