ఇంకెలా బతికేది?
కరోనాతో మనుషులు చస్తున్నారుగానీ..! మనుషులలో ఆశ,స్వార్థం అంతం అవడం లేదు. ఈ కరోనా వైరస్ కూడా కేవలం మనుషులనే తీసుకొని పోతోంది. అంటే ఇది మానవులకు ఏదో సందేశం ఇవ్వడానికే వచ్చింది. అది మనుషులలో లోపించిన మంచి, మానవత్వం కావచ్చు లేదా అగ్ర దేశాల కుట్రలతో మొదలైన బయో వార్ ఐన అయి ఉండవచ్చు. లేకపోతే ఇలా డబ్బులేని నిరుపేదలతో చెలగాటం ఆడి వారిని ఎందుకు నాశనం చేస్తోంది. వారు మరింత అప్పుల పాలు అవుతున్నారు.
రోగం వస్తే వైద్యం చేయించుకోవాలా? లాక్ డవున్ లతో పని లేక ఉపవాసాలు ఉండాలా? మనిషి జీవన చక్రం రివర్స్ అయ్యింది కావల్సిన ఆప్తులు, స్నేహితులు, బంధువులు, ఆచార్యులను ఈ కరోనా తన వెంట తీసుకుపోతోంది. అయ్యయ్యో చేతిలో డబ్బు పోయే..! జేబులు ఖాళీ ఆయే..! ఇంకెలా బతికేది? చివరికి ఫ్రీగా వీచే ఆ ప్రాణవాయువును కూడా డబ్బులకు కొనేలా చేస్తోంది.
Corona 2.0: కోట్ల మంది మనుషులకు ఇది చివరి మజిలీ అయ్యింది. ఇప్పటికైనా మిగిలిన వాళ్లం మంచి, మానవత్వం కలిగిన స్వార్థం లేని మనుషుల్లా బతుకుదాం!! లేదంటే గడువుకంటే ముందే అందరు టపా కట్టేయ్యాల్సిందే!!!
- Venkateshwarlu Boya
(Telangana Journalist)













