నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య మొదలయ్యింది. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి విస్పర్వ్యాలీలోని మహాప్రస్థానాన్ని ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. ఈ అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. అయితే, అంతిమయాత్ర మొదలుకావడానికి ముందు జరిగిన సంఘటన అందరితోనూ కంటతడి పెట్టించింది. హరికృష్ణ పార్థివదేహాన్ని పాడెమీద ఉంచిన తర్వాత, దాన్ని భుజాన ఎత్తుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హరికృష్ణ బావ చంద్రబాబునాయుడు స్వయంగా వచ్చారు. ఇక మరో వైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హరికృష్ణకు అత్యంత సన్నిహితుడైన …













