(Is TSPSC Group2 is going to be vein?)
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ,కనీవినీ ఎరగని రీతిలో TSPSC గ్రూప్ 2 పరీక్షను నిర్వహించబోతుందని గొప్పలు చెప్పి , చివరికి పరీక్షా రోజున తుస్సుమన్న TSPSC …పరీక్షా నిర్వహణలోనూ ఘోరంగా విఫలమయ్యి, తూ తూ మంత్రంగా పరీక్షా నిర్వహించి , అభ్యర్థులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది .ఇక పరీక్షా నిర్వహణ తర్వాత విడుదలయిన కీ లో లెక్కకు మించి తప్పులు ఉండటం …ఆ తరువాత 17 ప్రశ్నలను తొలగించడం,మరో 14 ప్రశ్నలకు ఒకటికి మించి జవాబులు ఇవ్వడం మొదలైన పనికిమాలిన నిర్ణయాలతో “కాలయాపన చేసి “చివరకి తప్పుడు కి విడుదల చేశారు .ఇక ఆ తరువాత group2 ఫలితాలను అప్పుడిస్తాం ఇప్పుడిస్తాం అని ఆగమాగమయి …అంతిమంగా ఫలితాలను వెల్లడించిన TSPSC అందర్నీ ఆశ్చర్య పరుస్తూ “అవినీతి“కి తెరలేపింది .అంతుపట్టని ,అయోమయ పలితాలతో పొంతన లేని నిర్ణయాలతో అందర్నీ అట్టే ముంచింది .అసలు ఎం జరిగిందో తెలుసుకుందామంటే అందుబాటులో లేకుండా పోయింది. (2011 group1 కూడా ఇలాంటి పనికిమాలిన చర్యల వల్లనే నేటికీ అలాగే పెండింగు లో ఉంది).
అసలు గ్రూప్ 2 పరీక్షా ఎందుకు రద్దవబోతుందో ఒక్కసారి పరిశీలిస్తే :
ఓఎంఆర్ ‘తప్పు దిద్దుబాటు’దారులకూ ఎంపిక జాబితాలో చోటు :
పరీక్షా కు ముందు TSPSC ఎం చెప్పింది :
1 ఓఎంఆర్ షీట్‌పై ఎలాంటి దిద్దుబాట్లను అంగీకరించే ప్రసక్తే లేదని అలాంటి అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనానికి పరిశీలించబోమని టీఎస్పీఎస్సీ పరీక్షకు ముందే నిబంధనల్లో స్పష్టం చేసింది. కానీ.. పరీక్షలో కొంతమంది వైట్నర్తో దిద్దుబాట్లు చేశారు. వీరి సంఖ్య దాదాపు 50వేల దాకా ఉంటుందని కమిషన్ వర్గాలే గతంలో తెలిపాయి. అంటే OMR షీట్ పై “వ్యక్తిగత వివరాల నమోదులోనైనా ,జవాబులు గుర్తించడం లో నైనా ” ఎక్కడైనా సరే “తప్పు దిద్దుబాట్లు ఉన్నా ,లేదా వైట్నర్ వాడినా ,ఎలాంటి గీతలు,రాతలు ఉన్నా ఆయా జవాబు పత్రాలను “లెక్కలోకి తీసుకోవద్దనేది నిబంధన .
ఒకవేళ పరీక్షా తరువాత ఆ నిబంధనలను మార్చినా ,తీసివేసినా ఇంకా ఏదైనా చేసినా అది “తప్పు “. న్యాయస్థానాల్లో అసలే నిలవదు .
ఓఎంఆర్ షీట్‌పై పై వైట్నర్ వాడిన అభ్యర్థుల వాదనేంటి :
అయితే …..ఎంతో ఆసక్తి తో ,కస్టపడి పరీక్షా రాయాలనుకుని ఎన్నో సంవత్సరాలు ఓపికతో ఎదురుచూసిన అభ్యర్థులు తీరా పరీక్ష కేంద్రం వద్దకు వెళితే అంతా తలకిందులు గా కనిపించింది అక్కడా.
1 . ఓఎంఆర్ షీట్ లో ఉన్న బార్ కోడ్ కి ప్రశ్నపత్రం లో ఉన్న బార్ కోడు కి సంబంధం లేకపోవడం వలన చాలా మంది తప్పు బబ్లింగ్ చేశారు .
2 . పరీక్షా ఇన్విజిలేటర్లు గా ఎలాంటి అనుభవం లేనివాళ్లను నియమించడం ,వారికి పరీక్షా నిర్వహణ పై ఎలాంటి స్పష్టత లేకపోవడం ,వారికి కనీస జ్ఞ్యానం లేకపోవడం మూలంగా పరీక్షా హాలు లో ఎం జరుగుతుందో ఎవ్వరికి అర్తం కాలేదు .
3 . ఇలాంటి అస్పష్ట నిభందనలు ,అర్హత లేని ఇన్విజిలేటర్లు వలన వారే “సరఫరా చేసిన వైట్నర్ “తో చిన్న చిన్న తప్పులను సరిదిద్దు కొని కొంతమంది పరీక్షా రాశారు .
4 . ఇంకా కొన్ని పరీక్షా కేంద్రాల్లో 2 వ ఓ ఎం ఆర్ ఇచ్చి వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ప్రత్యేక సమయం ఇచ్చి పరీక్షా రాయించారు .ఆ సమయంలో కొందరు అభ్యర్థులు దాదాపు 4 నుండి 6 గంటలు సమయం తీసుకొని పరీక్షా రాసి అదనపు లబ్ది పొందారు .ఆ తరువాత TSPSC ఒక స్పెషల్ నోటీసులో ..తప్పు బబ్లింగ్ చేసిన ,వైట్నర్ వాడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అందరిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా ఒక పేపరు పై నోటీసు ఇచ్చి,మిగితా పరీక్షను పూర్తి చేసింది .
అంటే “నిర్వాహకుల తప్పిదాల” వల్లే ఇలా తప్పు బబ్లింగ్ చేసి ,వైట్నర్ వాడాల్సి వచ్చిందని , కాబట్టి తమ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలంటూ చాలా మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టులు ఎం చెపుతున్నాయి ?గతం లో కోర్టు కేసుల్లో ఎం జరిగింది ?
దిద్దుబాటు అభ్యర్థుల వాదనను హైకోర్టు కొట్టేస్తూ వారి జవాబుపత్రాలను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏప్రిల్ 24 ,2017 న తేల్చిచెప్పింది
హైకోర్టే కాదు…గతంలో సుప్రీంకోర్టూ పలు కేసుల్లో దిద్దుబాటు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని చెప్పింది.
టీఎస్పీఎస్సీ కూడా హైకోర్టులో ఇదే వాదన వినిపించింది.
మరి ఫలితాల విడుదల తరువాత ఏమైంది :
నిబంధనలు విరుద్ధమని ప్రకటించిన TSPSC ,వాళ్ళను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టులో వాదించిన tspsc , వారిదే తప్పు …వారిని పరిగణలోకి తీసుకోకుండా మిగితావారి ఫలితాలను వెల్లడించండి అని కోర్టు చెప్పినాక కూడా …అన్నిటిని తోసిరాజని పరీక్షలో జవాబు పత్రాల(ఓఎంఆర్ షీట్లు)పై వైట్నర్తో దిద్దుబాట్లు చేసిన అభ్యర్థుల్లో చాలా మందికి శుక్రవారంనాటి ఫలితాల జాబితాలో చోటు దక్కింది .ఇది ఎలా ? దాదాపు ..కోర్టు లో కేసు వేసిన అందరి అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు ఫలితాల జాబితాలో ఉండటం అనుమానాలకు తావిస్తుంది.
మొత్తం ప్రశ్నలలో 35 ప్రశ్నలకు అతి గతి లేకపోవడం :
మొత్తం 600 ప్రశ్నలల్లో 17 ప్రశ్నలను తొలగిస్తున్నట్టు tspsc ప్రకటించింది .మరో 14 ప్రశ్నలకు 2 లేదా 3 అషన్సు ను కరెక్టు సమాధానంగా గుర్తిచవచ్చని ప్రకటించింది. అసలు ప్రశ్నపత్రం లో ఇన్ని ప్రశ్నలు తొలగించవచ్చా ? 14 ప్రశ్నలకు ఇలా రెండు సమాధానాలను గుర్తించవచ్చా ? అసలు ఇది కోర్టు లో నిలుస్తుందా ? ఇంతకు ముందు గ్రూప్ 1 (2011 ) లో తప్పుడు కీ వలన 2017 లో కూడా ఆ కేసు అలాగే ఉండటం దాదాపు రెండు మూడు సార్లు ఆ పరీక్షా నిర్వహించడం ..ఇంకా APPSC గ్రూప్ 1 లో తొలగించిన 45 మార్కులతో మళ్ళీ నియామకాలు ఆగిపోవడం .వెరసి మొత్తం గ్రూప్ 2 పరీక్షా రద్దయ్యే అవకాశమే ఎక్కువ. ఇంకా ఒకే ప్రశ్నకు రెండు సమాధానాలు ఇవ్వడం వలన ఈ క్రింది నష్టం జరిగే అవకాశం ఉంది .
ఉదాహరణకు మొదటగా ఒక అభ్యర్థికి 400 ,మరో అభ్యర్థికి 410 మార్కులు వచ్చాయని అనుకుందాం .ఫైనల్ కీ అండ్ రివైస్డ్ ఫైనల్ కి లో ఉస్మారు 14 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం వలన 410 మర్క్స్ వచ్చిన అభ్యర్థికి మార్క్స్ పెరగకుండా మొదటి 400 మార్క్స్ వచ్చిన మొదటి అభ్యర్థికి ఫైనల్ కి లో 14 మార్క్స్ పెరిగితే అప్పుడు తన మార్క్స్ 414 అవుతవి.అంటే రెండవ అభ్యర్థి కంటే మొదటి అభ్యర్థి కె ఎక్కువ మార్కులు వచ్చినట్టు కదా ! .అంటే ఇక్కడ ఎంతో మంది ఇలా నష్టపోయే అవకాశం ఉంది కదా !.
రిజర్వేషన్ల వారీగా ,పోస్టుల వారీగా ,జోన్ల వారీగా కట్ ఆప్ మార్కులు ప్రకటించకపోవడం :
భారీ కసరత్తు చేసి ,పోస్టుల వారీగా ,రిజర్వేషన్ల వారీగా ,జోన్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తుంన్నామని ప్రగల్బాలు పలికిన tspsc తీరా జాబితాలో మాత్రం ఏ మాత్రం స్పష్టత ,పారదర్శకత లేకుండా ఎలా పడితే అలా జాబితాను ప్రకటించింది .
రిజర్వేషన్ల వారీగా మార్కులు ప్రకటించకపోవడం వలన అసలు నిజమైన కట్ ఆప్ ఎంతో ,,,,ఎవరికీ ఎన్నెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది .దీనిలో ఎన్ని అక్రమాలు జరిగాయో అని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .
ఇంకా పోస్టుల వారీగా ప్రకటించకపోవడం(జాబితా మాత్రం పోస్టుల వారిగానే అని tspsc చెప్తుంది ) వలన ఎవరు ఏ పోస్టుకు అర్హులో tspsc తనకు తానె అభ్యర్థి అవకాశాన్ని నిర్ణయించి మరో గందరగోళానికి తెరలేపింది .ఇక్కడ తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఎదో ఒక కాటగిరిలో పోస్టు వచ్చే అవకాశం లేకపోలేదు .
పరీక్షా నిర్వహించినపుడు ఒక జోన్ లో ఉన్న అభ్యర్థి ఫలితాల నాటికీ వేరే జోన్ కి మారిండు.ఇప్పుడు తెలంగాణ లో జోనల్ వ్యవస్థ రద్దయిందని ప్రకటించిన ప్రభుత్వం ,ఎంకిక కాబడిన అభ్యర్థికి ఏ జోన్ లో పోస్టు ఇస్తుందో మరో ప్రశ్న .ఒక వేళా కానక జోనల్ వ్యవస్థ పై వివాదం ఏర్పడితే అది 10 సంవత్సరాల కైనా తేలే అవకాశమే లేదు .అంటే అనధికారికంగా గ్రూప్ 2 రద్దయినట్టే.
ఇక నోటిఫికేషన్ అప్పుడు కేవలం 1 : 2 ప్రకారం ఇంటర్వ్యూ కి పిలుస్తామని ప్రకటించిన tspsc ఇప్పుడు మాత్రం 1 : 3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ను కి పిలిచింది .అసలు ఇలా అవసరం లేని అభ్యర్థులను వెరిఫికేషన్ కు ఎందుకు పిలిచినట్టు .దేశం లో ఎక్కడైనా ఇలా జరిగిందా ? ఒకవేళ వెరిఫికేషన్ ను హాజరయి ,intarivew కి అర్హత పొందని అభ్యర్థి కోర్టు కు పొతే ఏంటి పరిస్థితి ( 2011 గ్రూప్ 1 లో ఇలాగే జరిగింది ) (TSPSC both statements)
ఒకే సెంటర్ నుండి ఒకే సిరీస్ నంబర్ తో ఎంతో మంది సెలెక్ట్ కావడం :
పరీక్షకు ముందు బయోమెట్రిక్ ఉండాలి ,బూట్లు ఏసుకు రావొద్దు, పుస్తెలుండొద్దు అని ఓవర్ యాక్షన్ చేసిన tspsc పరీక్షా నిర్వహణలో మాత్రం తేలిపోయింది .ఎలాంటి బయోమెట్రిక్ లేకుండా, అనుభవం లేని ఇన్విజిలేటర్లను నియమించి తీవ్ర అననుకూల పరిస్థితుల మధ్యన పరీక్షా నిర్వహించడం వలన ఇన్విజిలేటర్ల తో కుమ్మక్కై “మాస్ కాపీయింగ్ కు పాల్పడి “ఒకే పరీక్షా కేంద్రం నుండి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు .దీని పైన తీవ్ర అభ్యన్తరాలు ఎదురవుతున్నాయి .