తులసితో ఆరోగ్యం మరియు అందం – Health and Beauty with Tulsi
ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. మహిళలు ప్రతిరోజూ తులసి పూజ చేస్తుంటారు ఇలా రోజు పూజ చేయాలనే ఆలోచన భక్తే కాదు సైన్సు కూడా దాగుంది. తులసితో అనేక వ్యాధులను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది. ఈ ఆకులను పసుపును కలిపి మెత్తగా నూరి రాస్తే గాయాలు మొటిమల మచ్చలు తగ్గిపోతాయి. తులసి వేరు శొంటి మాత్రలను ప్రతి రోజు ఒకటి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో సేవిస్తే చాలా రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తులసి వెల్లుల్లిని నోరి వాటి రసాల్ని చెవిలో పోస్తే చెవిపోటు తగ్గిపోతుంది. తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే మూత్రం సాఫీగా వస్తుంది అలాగే మూత్ర సమస్యలు కాళ్ళ వాపులు తగ్గిపోతాయి. తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి మరిగించి కొద్దిగా తేనెను కలిపి తాగడం వల్ల జీర్ణాశయం శుబ్రం అవ్వడంతో పాటు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల సంఖ్య పెరుగుతుంది. తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి పిల్లలకు తాగిస్తే కడుపులో నులిపురుగులు నశిస్తాయి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ప్రతి రోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల తులసి చెట్టు పై నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇన్ని లాభాలు ఇచ్చే తులసిని పెరటి వేల్పు అన్నారు. Read the full article













