మండే ఎండలు గ్రీస్ అడవుల్లో కార్చిచ్చును రగిలించాయి. రాజధాని ఎథెన్స్ ను మూడు వైపుల నుంచి మంటలు చుట్టుముట్టాయి. సోమవారం నుంచి మొదలై మంటలు 24 గంటలు గడవకముందే 74 మందిని బలితీసుకున్నాయి. ఈ ప్రమాదంలో 172 మంది గాయపడ్డారు. గ్రీస్ అడవుల్లో ఎక్కువగా దేవదారు వృక్షాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఏథెన్స్ కు 40 కి.మీ. దూరంలోని గ్రామం మాటి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామంలో 26మంది సజీవదహనమయ్యారు. గంటకు వంద …





