IIFA Utsavam 2017 winners list: Janatha Garage bags 5 trophies including Best Actor for Jr NTR, while Kirik Party leads in Kannada cinema
@ http://rnapoint.com/CiniNewsView.aspx?CNID=235
seen from China
seen from Canada

seen from United States

seen from Malaysia
seen from Germany
seen from China

seen from United States
seen from United States

seen from United States
seen from United States
seen from China
seen from Russia

seen from Canada
seen from Germany
seen from Germany
seen from Canada
seen from United States

seen from United States
seen from Colombia
seen from France
IIFA Utsavam 2017 winners list: Janatha Garage bags 5 trophies including Best Actor for Jr NTR, while Kirik Party leads in Kannada cinema
@ http://rnapoint.com/CiniNewsView.aspx?CNID=235
#Koratalasiva కొరటాల.. తీసింది మూడు సినిమాలే..కానీ ఆ మూడు సూపర్ హిట్సే. నాలుగో సినిమాకే 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న తొలి తెలుగు డైరెక్టర్ కూడా కొరటాలే.. చాలామంది సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవడం కోసం మంచిమాటలు చెబుతారు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయని భావించే వాళ్ళే ఎక్కువ. కానీ, కొరటాల శివ అలా కాదు. మూడు సినిమాల్లో మూడు సందేశాలు ఇచ్చిన కొరటాల రియల్ లైఫ్ లో చిన్నప్పటినుండి అలాంటి ఆదర్శాలను పాటించాడు. చిన్నప్పటినుండే, తన ప్రతి పుట్టినరోజుకి మదర్ తెరిసా ఫౌండేషన్ కు బస్తా బియ్యం విరాళంగా ఇచ్చేవాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబం రామకృష్ణ పరమహంస ఫాలోయర్స్. ఇప్పటికీ తనకు ఇష్టమైన టైంపాస్ తన భార్యతో రామకృష్ణ మఠం కు వెళ్లి కాసేపు గడపడమే అని కొరటాల చెబుతున్నారు. దురదృష్టం ఏంటంటే కొరటాల శివ భార్యకి ఇప్పటికి రెండు సార్లు మిస్ క్యారేజ్(అబార్షన్) అయిందట. అందుకే “ఇక పిల్లలు వద్దు, ఏదైనా సేవా కార్యక్రమాలు చేద్దాం అని ఇద్దరం ఆలోచిస్తున్నాం” అని కొరటాల ఎబిఎన్ఆంధ్రజ్యోతి కి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చెప్పారు. సినిమాల్లో హీరోలతో నీతీ సూత్రాలు చెప్పించడమే కాదు, ఆ నీతుల్ని పాటిస్తున్న కొరటాల శివకు హాట్సాఫ్. హ్యాట్రిక్ హిట్స్ తో టాప్ డైరెక్టర్స్ లిస్టు లో చేరిపోయిన కొరటాల, మంచి మనసులో కూడా టాప్ అని నిరూపించుకున్నాడు. మీ సక్సెస్ లతో పాటు మీ మంచితనం కూడా ఇలాగే పెరుగుతూ ఉండాలని కొరడా.కాం కోరుకుంటోంది.
సమంత.. నిత్యలకి సీన్ రివర్స్ అయ్యింది -- CinemaNagar
New Post has been published on http://cinemanagar.com/cnhome/?p=63838
సమంత.. నిత్యలకి సీన్ రివర్స్ అయ్యింది
సమంత.. నిత్యలకి సీన్ రివర్స్ అయ్యింది
జనతా గ్యారేజ్ రిలీజ్ కి ముందు ఈ మూవీలో చేసిన క్యారెక్టర్స్ గురించి నిత్యమీనన్..సమంత ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. నేను హీరోయిన్ గా చేస్తున్నాను కాజల్ మాత్రం ఐటెం సాంగ్ చేస్తోంది అని సమంత కోతలు కోస్తే.. నేను హీరోయిన్ రేంజ్ లో వుండే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నానంటూ నిత్య బిల్డప్ ఇచ్చింది. జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ ఫస్ట్ మూవీ ‘మిర్చి’లో అనుష్క..రిచా గంగోపాధ్యాయ్ ఇద్దరికీ కధని మలుపుతిప్పే ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చాడు. ఇక రెండో మూవీ ‘శ్రీమంతుడు’లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా కీ రోల్ చేసింది. దాంతో మూడో మూవీ ‘జనతా గ్యారేజ్’లో కూడా సమంత.. నిత్యా మీనన్ అలాంటి కీ రోల్స్ చేస్తున్నారని అనుకున్నారంతా. పైగా సమంత..నిత్య ఇద్దరూ తమ రోల్స్ గురించి ఓ రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. కానీ జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యాకా సమంత.. నిత్యలకి సీన్ రివర్స్ అయ్యింది. ఈ మూవీలో వీరిద్దరి క్యారెక్టర్స్ కి అస్సలు ఇంపార్టెంస్ లేదని తేలిపోయింది..కేవలం నామ్ కే వాస్తే వున్నారంతే.మూవీ మొత్తం మోహన్ లాల్.. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ తో నిండిపోయింది. దాంతో అసలు ఈ మూవీలో సమంత..నిత్య చేయడానికి ఏం లేకపోయింది.
కవర్ చేసుకునే ప్రయత్నంలో కొరటాల? -- CinemaNagar
New Post has been published on http://cinemanagar.com/cnhome/?p=63821
కవర్ చేసుకునే ప్రయత్నంలో కొరటాల?
కవర్ చేసుకునే ప్రయత్నంలో కొరటాల?
కొరటాల శివ దర్శకుడిగా ‘జనతా గ్యారేజ్’తో అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఐతే మాటలతో మాత్రం బాగానే కవర్ చేయాలని చూస్తున్నాడు. ఒక సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలున్నపుడు.. కొంచెమైనా ఏకీభవించే ప్రయత్నం చేయాలి. పూర్తిగా అన్ని విమర్శల్నీ కొట్టిపడేస్తూ.. ఆహా ఓహో అన్న మాటలే మాట్లాడుతున్నాడు కొరటాల. ‘శ్రీమంతుడు’ సినిమా కొరటాల కెరీర్లో మైలురాయి అనడంలో సందేహం లేదు. కొరటాల ఈ సినిమా విషయంలో గొప్ప ప్రశంసలందుకున్నాడు. ఐతే దాంతో పోలిస్తే ‘జనతా గ్యారేజ్’ గొప్ప సినిమా అన్నట్లు మాట్లాడుతున్నాడు కొరటాల. ఇది అందరూ అంటున్న మాట అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ‘జనతా గ్యారేజ్’ ఒక క్లాసిక్ అంటూ ఇంకో పెద్ద మాట కూడా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. అభిమానుల కోణంలో చూస్తే ‘జనతా గ్యారేజ్’ బ్లాక్బస్టర్ కాదు.. కానీ సామాన్య ప్రేక్షకుల దృష్టిలో చూస్తే మాత్రం ఇది క్లాసిక్ అంటున్నాడు కొరటాల. సినిమాకు రెస్పాన్స్ బాగుంది.. కలెక్షన్లు బాగున్నాయి.. కొంచెం డివైడ్ టాక్ ఉన్నా బాగానే ఆడుతోంది అంటూ కొంచెం నిజాయితీగా మాట్లాడితే బాగుంటుంది కానీ.. క్లాసిక్ అని.. ‘శ్రీమంతుడు’ కన్నా గొప్ప సినిమా అని అంటే జనాలకు అదోలా అనిపిస్తుంది. ఎప్పుడూ నిజాయితీగా.. సింపుల్గా మాట్లాడే కొరటాల.. భిన్నాభిప్రాయాలున్న సినిమా గురించి కవర్ చేసుకునే ప్రయత్నంలో తన క్రెడిబిలిటీని కొంత దెబ్బ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.