హైదరాబాద్ : ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని త్వరలో పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభించనుండగా.. ఈ మేరకు నియోజకవర్గ దళితులు, ఉన్నతాధికారులతో సోమవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారన్నారు. పథకంపై రాష్ట్రవ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం …














