800 సంవత్సరాల పురాతన ఆలయంలో, కారు, విమానం మరియు బైక్ ను చెక్కారా?
Hey guys, ఈ రోజు మనం ఇండోనేషియాలోని బాలిలో, చాలా విచిత్రమైన ఒక పురాతన ఆలయానికి వెళ్తున్నాము. మీరు చూడగలిగినట్లుగా, ఇదే ఈ ఆలయం పేరు, దీన్ని నిర్మించిన సంవత్సరాన్ని, ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ఆలయాన్ని, 1205 లో నిర్మించారు, అంటే ఇది నిర్మించి సుమారు 800 సంవత్సరాల క్రితం అవుతుంది. కానీ, దీని వెనుక ఉన్న గోడపై, ఈ వింత చెక్కడాన్ని మీరు చూడవచ్చు. ఇది ఏంటని, మీరు నాకు చెప్పగలరా? అవును, ఇది ఒక car, దీనికి modern-day car లాగ నాలుగు చక్రాలు ఉన్నారు. ఇక్కడ మీరు ఈ మొత్తం కారును చూడవచ్చు; దీనిపై ఒక doorను కూడా చెక్కారు చూడండి. ఈ వ్యక్తి drive చేస్తున్నాడు, అతను steering wheelపై ఒక చేతిని ఉంచి, మరోవైపు, అతను horn కొడుతున్నాడు చూడండి, అతను ఈ బల్బు లాంటి horn నొక్కి దాని ద్వారా sound చేస్తున్నాడు, ఈ రకమైన hornలను Bugle air horns అని అంటారు, మీరు వాటిని నొక్కినప్పుడు, అది sound చేస్తుంది. ఈ car frontలో పెద్ద లైట్ ఉంది చూడండి, ముందు భాగంలో ఒక పెద్ద కాంతి మూలం అమర్చబడి ఉంది. 800 ఏళ్ల క్రితం కట్టిన గుడిలో, carను ఎలా చెక్కాలి? 800 సంవత్సరాల క్రితం కార్లు ఉండేవా? అయితే అంతకన్నా crazy ఇంకేదో ఉంది, ఈ వ్యక్తి ఏమి పట్టుకుంటున్నాడో చెప్పగలరా? అది gun ఆహ్? అవును, అది ఒక pistol.
ఆ వ్యక్తి gunను పట్టుకుని ఇక్కడ car driverని shoot చేయబోతున్నాడు. ఏం జరుగుతోంది? ఈ వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు. మీరు అతని పెద్ద బూట్లు దిగువన చూడవచ్చు. కానీ ఈ మొత్తం దృశ్యం చాలా అధివాస్తవికంగా కనిపిస్తుంది, ఎందుకంటే మీరు దాని పక్కన చెక్కబడినది కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక పురాతన సైనికుడు, గుర్రంపై కూర్చున్నాడు. ఒక చేతిలో విల్లును పట్టుకుని అందులోంచి బాణం వదులుతున్నాడు. అక్కడ, అతని ముందు ఒక వ్యక్తి ,మోకరిల్లి ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు. ఇండోనేషియాలోని 800 ఏళ్ల నాటి హిందూ దేవాలయాలకు ఇది విలక్షణమైనది. So, మనం ఎడమవైపున, పురాతన బాణం మరియు కుడి వైపున modern gunని చూడవచ్చు. చాలా శతాబ్దాల క్రితం నాటి దృశ్యాన్ని, చాలా ఆధునికమైన దృశ్యంతో పాటు మనం ఎలా చూస్తాము? కానీ, బహుశా, ఇది gun కాకపోవచ్చు, మరేదైనా కావచ్చు, కదా? ఎందుకంటే, ఇక్కడ చెక్కిన శిల్పాలు, చాలా పాతవి మరియు చెడిపోయినందున, బహుశా మనం పొరపాటు చేస్తున్నాము. And ఇది కారు కాకపోతే, ఒకవేళ గుర్రం లేని ఒక రథం లేదా గుర్రపు బండి అయితే? మనం తప్పు చేసే అవకాశం ఉందా? లేదు, సమీపంలో ఉన్న ఈ చెక్కడాన్ని చూడండి. ఇక్కడ మరొక కారు ఉంది, ఖచ్చితంగా ఇది car ఎహ్.
Praveen Mohan Telugu











