విశాఖలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి కలకలం రేపిన మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు మంగళవారం ఉదయం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. వైఎస్ జగన్ను కలవడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన సీఎంతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ను కలవడంపై కారణాలను ఆయన చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబే ఆయన్ను పిలిపించారా లేక, అపార్థాలను తొలగించుకోవడానికి సాంబశివరావే వచ్చి వివరణ ఇచ్చుకున్నారా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు టీడీపీలోనూ …










