ఎందుకు వీటిని దాస్తున్నారు, వెనుక ఉన్న రహస్యం ఏంటీ? |ప్రవీణ్ మోహన్|
Hey guys, నా ముందు వీడియోలో, పురాతనమైన తిరుప్పెరున్తురై అనే ఆలయంలో, 27 నక్షత్రాలు లేదా చంద్ర స్టేషన్లను చెక్కారని నేను మీకు చూపించాను. ఈ వీడియోలో, నేను వాటికి సంబంధించిన మిగతా వివరాలలోకి వెళ్లాలనుకుంటున్నాను. ఈ నక్షత్ర వ్యవస్థల పక్కనే, మీరు అనేక వింత దేవుళ్లను చూడవచ్చు. ఎవరు వీళ్లంతా? మనం కొంచెం దగ్గరికి వెళ్లి పరిశీలిద్దాం, ఇది చంద్రుడు, వేద గ్రంథాల ప్రకారం చూసుకుంటే, ఈ చంద్రుడు ఒక పురుషుడు, ఇతను ఏం చేసాడంటే, ఈ 27 చంద్ర స్టేషన్లను, వివాహం చేసుకున్నాడు. ఈ పురాతన కథ చాలా వింతగా మరియు అర్థరహితంగా అనిపిస్తుంది - చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడా? అసలు ఏం అర్ధం కావడంలేదు కదా? 27 నక్షత్రాలే ఎందుకు ఉన్నాయి? ఆకాశాన్ని 25 లేదా 50 వేర్వేరు విభాగాలుగా ఎందుకు విభజించకూడదు? ఈ 27 నక్షత్రాలు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి తీసుకున్న 27 రోజులను సూచిస్తాయి.
So, చంద్రుడు ప్రతి నెలా ఒక్కో నక్షత్రంతో ఒక రోజు గడుపుతాడు, అంటే ప్రతి నక్షత్ర నెల లేదా 27 రోజుల సమయం పడుతుంది. దీని కారణంగానే, చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడని, భారతీయ గ్రంథాలు చెప్పినప్పుడు, ఇది ఒక ప్రతీకాత్మకమైన అర్థం. నక్షత్రాలకు ఇటువైపు చంద్రుడిని చెక్కారంటే, అటువైపు ఏం చెక్కుంటారు ? అవును, సూర్య దేవుడ్నే చెక్కారు. ఇది అసాధారణమైన వర్ణన, సూర్య భగవానుడిని, 7 గుర్రాలు ఉన్న ఒక రథంలో ఉన్నట్టు చూపించలేదు. అదే విధంగా, మరొక interesting అయినా విషయం ఏంటంటే, సూర్యభగవానుడు, కాళ్ళు చెప్పులు లేకుండా ఉన్నాయి, అతని కాళ్ళలో చీలమండలను మీరు చూడవచ్చు మరియు అతని కాలి వేళ్ళను కూడా చూడవచ్చు. ఉత్తర భారతదేశంలో, సూర్యభగవానుడిని చూపించే విధానం కంటే ఇది చాలా భిన్నమైనది. ఉదాహరణకు, గుజరాత్ లో, మోధేరా సూర్య దేవాలయంలో, సూర్య దేవుడు పొడవాటి, గమ్ బూట్లు ధరించడం మీరు చూడవచ్చు. కానీ, ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా చూపించారు. తరువాత ఇక్కడ చూడండి, ఒక విల్లు మరియు బాణం పట్టుకున్నట్లు ఒక అరుదైన శిల్పం ఇక్కడ ఉంది.
ఇది ఎవరో మీరు ఊహించగలరా? ఇదే బుధుడు, అంటే బుధగ్రహం. ఈ చెక్కడం పైన చూడండి, ఇదే బుధ గ్రహమని నిర్ధారించుకోవడానికి, ఒక చిన్న శాసనం ఉంది. ఇక్కడ మరొక చెక్కడం ఉంది చూడండి, ఇది, ఏ దేవుడిని సూచిస్తుంది? అతను, మూడు వేర్వేరు ఆయుధాలను పట్టుకున్నట్లు చూపించారు చూడండి, ఒక త్రిశూలం, ఒక వజ్రాయుధం మరియు ఒక ఈటెను పట్టుకుని ఉన్నారు చూడండి. ఇతను ఎవరంటే, ఇతనే mars, అంటే అంగారక గ్రహాన్ని సూచిస్తాడు. ఆయనను సంస్కృతంలో మంగళ అని, తెలుగు భాషలో అంగారక గ్రహం అని పిలుస్తారు. ఇవన్నీ చాలా అరుదైన శిల్పాలు, ఆలయాలలో ఉన్న, గ్రహాలు మరియు ఖగోళ వస్తువుల యొక్క పెద్ద చెక్కడాలను మీరు చూడలేరు, సాధారణంగా చూశామంటే, నవగ్రహాల యొక్క చిన్న చిన్న విగ్రహాలుగా చూస్తాము, కానీ ఇక్కడ మీరు చూస్తున్నది చాలా అరుదైన విషయం. కానీ ఈ వీడియోలో, నేను మీకు ఎవరికీ తెలియని, ఒక రహస్యాన్ని చూపించాలనుకుంటున్నాను. ఈ అంగారక గ్రహానికి పైన, ఏం చెక్కారో చూడండి. అది ఏమై ఉంటుంది? ఇది చూడడానికి చంద్రవంకలాగా కనిపిస్తుంది, దాని లోపల ఉన్న ఒక చిన్న circleలో ఒక ముఖాన్ని కూడా చెక్కారు చూడండి.
ఈ ముఖం పైన, మీరు కళ్ళు, ముక్కు మరియు నోటిని చూడవచ్చు, నుదిటిపైన పెట్టిన, ఈ బొట్టును కూడా మనం చూడవచ్చు. ఇది అంగారక గ్రహానికి సంబంధించిన ఒక రహస్య చిహ్నం. ఈ ఆలయంలో, ఇలాంటి అనేక విచిత్రమైన వివరాలు దాగి ఉన్నాయి. ఆకాశంలో ఉన్న, ప్రతి స్వర్గపు శరీరంకి పైన, ఒక రహస్య చిహ్నానాన్ని చెక్కారు చూడండి. సూర్యుని యొక్క శిల్పానికి, పైన చూడండి, మళ్ళీ మీరు ఒక వింత patternను చూడవచ్చు. ఇది, ఏదో ఒక పరికరం లోపల తయారు చేసిన, ఒక complex అయినా ముడిలా కనిపిస్తుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ స్ట్రింగ్ యొక్క సంక్లిష్టతను చూడండి, దీన్ని చాలా brilliantగా చెక్కారు కదా. ఈ రహస్య చిహ్నం, సూర్యుడికి ఎలా connect అయింది? దీని అర్థం ఏమై ఉంటుంది? సరే ఇప్పుడు మనం, చంద్రునికి పైన చూద్దామా, ఇక్కడ ఫాన్సీ ఈకలతో ఉన్న ఒక రహస్యమైన పక్షి కనిపిస్తుంది చూడండి. ఇది ఏ పక్షి? ఇది, చంద్రునికి ఎలా కనెక్ట్ అయింది?
బుధ గ్రహం పైన కూడా, ఇదేలాంటి patternను మనం చూడవచ్చు. ఈ రహస్య చిహ్నాలకు అర్థం ఏంటీ? ప్రతి గుర్తు క్రింద చెక్కబడి ఉన్న ఆయా గ్రహాలకు, ఇవన్నీ ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? సరే, స్తంభాలను వదిలేసి, ఇప్పుడు మనం ceilingను చూద్దాం, ఇక్కడ నమ్మలేని కొన్ని వివరాలు ఉన్నాయి. ఇక్కడ, మీ దృష్టి వెంటనే ఈ రాతి గొలుసు పైకి ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఈ, ceilingకు attach అయినా మెటల్ గొలుసులా? ఈ శిల్పాలను, చెక్కిన అదే పెద్ద రాతి బ్లాక్లో ఒక భాగంగా ఈ గొలుసులు ఉన్నాయి. పురాతన కాలంలో ఇంత అసాధారణమైన ఒక రాతి పని చేసి, దానిని చాలా ఎత్తులో ఉంచారు చూడండి. ఈ మధ్యలో, ఒక పెద్ద, circle shapeలో ఉన్న, ఒక 3డి pattern ఉంది చూడండి, కొంతమంది, ఇది rotate అవుద్దని కూడా చెప్తున్నారు. ఇందులో మరింత interesting అయినా విషయం ఏంటంటే, ఈ circle చుట్టూ చాలా శిల్పాలను చెక్కారు చూడండి.