|| బ్రహ్మ రాత ||
అనగనగా ఓ రాజూ రాణి ఉండేవారు. వారికి ఒక్కగాని ఒక్క కూతురు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమెను ఎంతో గారాబంగా పెంచారు. పెంచితే సరా? మంచి మొగుణ్ణి చూసి పెళ్లి చేసుకోవద్దూ! అక్కడే వచ్చింది పేచీ భార్యా భర్తలకు. "మా ఆ కకొడుకున్నాడుగదా, అతగాడి కిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని" అన్నాడు రాజు. రాణి అందుకు ఒప్పుకోలేదు. "అమ్మాయి పుట్టినప్పట్నుంచీ దాన్ని మా అన్నయ్యగా రబ్బాయి కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు మీరిలా అంటే ఎలా కుదురు తుంది ? ” అంది. పెళ్లి విషయంలో రాజూ, రాణి ఇలా రోజూ తగాయిదా పడుతుండేవారు. ఆఖరికి ఒకనాడు రాజు, 'నేను రాజును! నాకు ఎవరూ ఎదురుచెప్పడానికి వీల్లేదు.













