తెలంగాణ రాష్ట్రంలో 2 తేదీ వరకు సభలు, ర్యాలీలపై నిషేధం: డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో కోవిడ్, ఓమైక్రాన్ నియంత్రణలో భాగంగా జనవరి 2 వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్,పీ. లకు, పోలీస్ కమీషనర్ల ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అమలు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులను ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలనే అంశాలపట్ల ప్రజలను చెతన్య వంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి నిబంధనలను అనుసరించి వెయ్యు రూపాయల ఫైన్ ను విదించనున్నామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అనుమతి పొందిన కార్యక్రమాలలో విధిగా కోవిద్ నియమ, నిబంధనలను పాటించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను కోరామని డీజీపీ మహేందర్ రెడ్డి నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సైబారాబాద్ పోలీసులు
సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్ లు మరియు పబ్ ల యజమాన్యంతో సైబారాబాద్ పోలీసులు సమీక్ష సమావేశo ఏర్పాటు చేయడం జరిగింది. నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మైనర్లను అనుమతించవద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్ మరియు బార్ యజమానులను సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్.,., హెచ్చరించారు. ఓమిక్రాన్ భయంతో పబ్లు, బార్ల యజమానులు ఆరోగ్య శాఖ విధించిన షరతులను ఉల్లంఘించరాదని, ఆంక్షల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి, శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలి మరియు వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.


















