హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా శుక్రవారం మూడవ, నాల్గవ నామినేషన్ సెట్లు దాఖలు చేసిన శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా రైతు వ్యతిరేక బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరిన మంత్రి శ్రీ హరీష్ రావు. హుజూరాబాద్ ఎన్నికల్లో నిబద్ధతగల టీఆర్ఎస్.. అబద్ధాల బీజేపీకి మధ్యే పోటీ నెలకొందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అమ్మకాల బీజేపీకి, నమ్మకానికి మారుపేరైన టీఆర్ఎస్కు మధ్య పోటీ జరుగుతోందంటూ వెల్లడించారు. అరాచకానికి.. అభివృద్దికి మధ్య, బొట్టు బిళ్లకు.. కల్యాణ లక్ష్మికి మధ్య పోటీ జరుగుతోందంటూ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. #VoteForCar #HuzurabadWithTRS https://www.instagram.com/p/CUw1m6APudD/?utm_medium=tumblr