Alisa U Zemlji Chuda
TVSTRANGERTHINGS
Misplaced Lens Cap

tannertan36

roma★
Three Goblin Art

#extradirty
wallacepolsom
Claire Keane
almost home
sheepfilms
Aqua Utopia|海の底で記憶を紡ぐ
No title available
he wasn't even looking at me and he found me

Andulka
macklin celebrini has autism

titsay

Kaledo Art
Monterey Bay Aquarium
cherry valley forever
seen from United States
seen from Colombia
seen from Colombia
seen from Colombia
seen from Malaysia

seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from United States

seen from Malaysia
seen from United States

seen from Malaysia

seen from United Kingdom

seen from Germany
@venkatreddy-gotike
రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తద్వారా.. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ ను, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావును సీఎం ఆదేశించారు.
ఈరోజు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వూహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నదని సీఎం అన్నారు. ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమౌతున్నదని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సహకారంతో మొగిలిగిద్దలో( 8) అవార్డ్ లో మైనారిటీ ఏరియా మహమ్మదీయ మస్జిద్ నుండి గౌన్ కాడి ఏరియా వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి జై తెలంగాణ జై కేసీఆర్ సార్ https://www.instagram.com/p/Cq2y5haPlUG/?igshid=NGJjMDIxMWI=
గ్రామాల్లోనే యాసంగి ధాన్యం కొనుగోళ్లు... రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం వెంటనే ఏడు వేల కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ కేసీఆర్. https://www.instagram.com/p/Cq2iNfEvreY/?igshid=NGJjMDIxMWI=
#నందిగామ మండల బిఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో #పీపుల్స్_లీడర్ రవన్న https://www.instagram.com/p/Cq1rTTsv25q/?igshid=NGJjMDIxMWI=
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారిని సీఎం గారు ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. - File Photo https://www.instagram.com/p/Cq0iM_4vvXM/?igshid=NGJjMDIxMWI=
గారు అన్నారు. షాద్ నగర్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణానికి ప్రగతి ఫలాలు అందించడం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోని సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయంగా ఆత్మీయ సమ్మేళనాలు వేడుకగా కొనసాగుతున్నాయని అన్నారు #KCR Kalvakuntla Taraka Rama Rao - KTR #ఆత్మీయసమ్మేళనంy https://www.instagram.com/p/Cqx50DbPDx4/?igshid=NGJjMDIxMWI=
అయ్యవారి పల్లె లో బలగం* టీమ్ వెంకట్ రెడ్డి గోటికే ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ప్రదర్శన* తక్కువ పెట్టుబడితో అశ్లీలతకు తావులేకుండా బలగం సినిమా ప్రతి పల్లెను తట్టి లేపుతుంది,మనుషులను హత్తుకుంటుంది గుండెలను పిండి కన్నీళ్ళు తెప్పిస్తుంది.ఓ మధ్యతరగతి కుటుంబం జీవన విధానం సంబంధ బాంధవ్యాలను గురించీ చక్కగా వివరించే సినిమా బలగం ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారి పల్లి గ్రామములో గ్రామ ప్రజలు మొత్తం బలగం సినిమా చూడాలని అయ్యవారి పల్లె బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి గోటికే స్వతహాగా గ్రామ పంచాయతీ అవారణలో శుక్రవారం నాడు రాత్రి 7 గంటలకు సినిమ ప్రదర్శన వుంటుంది, గ్రామస్థులు అందరూ తప్పకుండా హాజరై సినిమా చూడాలని కోరారు. @Team venkat Reddy gotike BRS. https://www.instagram.com/p/Cqu7RJEvGSf/?igshid=NGJjMDIxMWI=
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై జంగ్ సైరన్ ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12 న రామగుండంలో ప్రధాని ఇచ్చిన మాట తప్పారు? యూ టర్న్ తీసుకున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుదాం వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ https://www.instagram.com/p/CquzhFxvQh-/?igshid=NGJjMDIxMWI=
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన గ్లోబోకాన్ 2020 డాటా ప్రకారం, భారతదేశంలో మొత్తం క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ 13.5 శాతం కాగా, గర్భాశయ క్యాన్సర్ 9.4 శాతంగా నమోదైంది. మహిళలలో 26.3 శాతం రొమ్ము క్యాన్సర్ బారినపడగా, 18.3 శాతం గర్భాశయ క్యాన్సర్ బాధితులు ఉన్నారు. గత పాతికేళ్లల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారత్లో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఎన్సీఆర్పీ) చేసిన ఒక అధ్యయనం చెబుతోంది. మహిళలలో 25 నుంచి 50 మధ్య వయసు వారు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని, క్యాన్సర్ లక్షణాలను త్వరగా గుర్తించకపోవడం వలన మరణాల రేటు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే కాకుండా, భారతదేశంలో మహిళలను పీడిస్తున్న మరొక పెద్ద సమస్య రక్తహీనత. 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలలో సుమారు 50 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు 1.మామోగ్రఫీ 2. పాప్ స్మియర్ టెస్ట్ 3. కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) 4. థైరాయిడ్ 5. ఎముకల బలహీనత - విటమిన్ డి, కాల్షియం టెస్ట్ @ team venkat Reddy gotike BRS https://www.instagram.com/p/CquVvOPvNPJ/?igshid=NGJjMDIxMWI=
తెలంగాణలో అతిపెద్ద జాతరల్లో ఒకటైన నాగర్ కర్నూల్ జిల్లా సలేశ్వరం లింగమయ్య స్వామి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు రావడంతో నల్లమల అటవీప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. బుధవారం ప్రారంభమైన జాతర రేపు శుక్రవారం వరకు మూడు రోజుల పాటు జరుగుతుంది. ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో సలేశ్వరం లోయలోని లింగమయ్య స్వామి గుహాలయం సమీపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యూలైన్లలో కొంతమంది భక్తులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్వకుర్తికి చెందిన చంద్రయ్య (50) అనే వ్యక్తి ఊపిరాడక లోయలో చనిపోయాడు. https://www.instagram.com/p/Cqs2AOBv0_v/?igshid=NGJjMDIxMWI=
తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, షాద్ నగర్ BRS పార్టీ యువ నాయకుడు #SriHari కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు https://www.instagram.com/p/CqsjtbnPj13/?igshid=NGJjMDIxMWI=