జర్నలిజంలో నూతన ఒరవడితో తనదైన ప్రత్యేకతను చాటుతూ 24 గంటల పాటు వార్తలను అందిస్తున్న రాజ్ న్యూస్ గురించి తెలుగు .న్యూస్ ప్రత్యేక కథనం.
ముందుగా 1983 వ సంవత్సరంలో నలుగురు సోదరులు కలిసి ' రాజ్ వీడియో విజన్ పేరుతో వీడియో క్యాసెట్ లేండింగ్ కంపెనీని ప్రారంభించారు. తరువాత 1984లో ఈ బృందం ముందుగా తమిళ చిత్రాల హక్కులను పొందడం జరిగింది. 1987లో రాజేంద్ర ఇంటిగ్రేటెడ్ స్టూడియోను రాజు గ్రూప్ ఆరంభించింది. దీన్ని స్వాతంత్ర సినిమాలతో పాటు సీరియల్స్ ను రూపొందించడానికి వినియోగించారు.
** అనంతరం రాజ్ టెలివిజన్ నెట్ వర్క్ జూన్ 3, 1994 వ సంవత్సరంలో ఆవిష్కరించబడింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఈ ఛానల్ తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో వీక్షకులను అలరిస్తుంది. హిందీలో రాజ్ పరివార్ గా పిలవబడుతుంది.
** సుషీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో తన హవా కొనసాగిస్తున్న రాజ్ న్యూస్ రోజంతా నిర్విరామంగా న్యూస్ ను ప్రజెంట్ చేస్తోంది. మరోవైపు రాజ్ న్యూస్ తమిళం అతితక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రెండవ ఛానల్ గా ప్రఖ్యాతి చెందడం గమనార్హం.











