Trinethram News : మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సదుపాయాన్ని 85 ఏళ్లు, ఆపై వయసున్న వారికి మాత్రమే కల్పించనున్నట్లు పేర్కొంది.ఈ మేరకు నిబంధనలను సవరించింది.గతంలో 80 ఏళ్లు, ఆపై వయసు వారికి ఇంటి నుంచే ఓటేసే సదుపాయం ఉండగా తాజాగా ఈసీ వయసు పరిమితిని పెంచింది.















