మంత్రి కేటీఆర్ కి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సపోర్ట్!
ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్ కి సపోర్ట్ గా నిలిచారు. ఓ ఫాంహౌజ్ విషయంలో మంత్రి కేటీఆర్ కి NGT నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్ కి సపోర్ట్ గా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసదుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ శివారులోని గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111ను ఉల్లంఘించారనే ఆరోపణలపై నోటీసులు జారీ అయ్యాయి. ఈ పిటిషన్ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేశారు అయితే దీనిపైన కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. లాక్ డౌన్ ఎందుకు ఫెయిల్ అయ్యింది..? మన భవిష్యత్ ఏంటీ..? https://twitter.com/KTRTRS/status/1269268649241542657 ఆ భూమి తనది కాదని ఓ కాంగ్రెస్ నేత కావాలనే తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే దీనిపైన స్పష్టత ఇచ్చానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి ఒవైసీ సపోర్ట్ చేస్తూ మద్ధతుగా మరో ట్వీట్ చేశారు. మీ వెంట మేం ఉన్నాం.. సార్.. మీరు సక్సెస్ ఫుల్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు. అందుకే ప్రతిపక్షాలు మీమీదా అసహనానికి గురి అవుతున్నాయి. అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగండి అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! https://twitter.com/asadowaisi/status/1269292686462169089 Read the full article












