#Tollywood #TollywoodProducer #AswiniDutt #TDP #SupportToTDP #VyjayanthiMovies రక్తంలో ఎర్రసైన్యం... తొక్కేది మాత్రం సైకిల్! వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ 45 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత సి.అశ్వినీదత్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తన సినిమాల గురుంచి మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా ఆయన మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీపై తనకు అభిమానం ఇప్పటిది కాదన్నారు. రాజకీయ ప్రవేశానికి మన్మధుడు సిద్దమేనా ? ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేస్తారని, అనుకున్నాను తప్ప తాను ఆయన వెనుక వెళ్లలేదని అశ్వినీదత్ చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడిన తను ఇక్కడ నుండే చంద్రబాబునాయుడు చేస్తున్న పనులు చూసి, కేవలం ఆయన మీద ఆకర్షణతో ముందుకు వచ్చానని వివరించారు. దేవదాస్ సినిమా విడుదల తర్వాత ...తెలుగుదేశం పార్టీ ప్రచారానికి సంబంధించిన పనులు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు, అయితే ఎన్నికల్లో పోటీ చేయబోనని, తెలిపారు. తన తండ్రి పెద్ద కమ్యూనిస్ట్ అని, తన నరనరాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని, అలాంటిది తనకు చంద్రబాబుపై ఇష్టమని, అందుకే తెలుగుదేశం పార్టీకోసం ప్రచారం చేస్తున్నానని చెప్పారు. అయితే అయన నిర్మించిన దేవదాస్ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.