ఎన్ని టేకులు తిన్నానో ! ‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్’ అనిపించుకోవడం అందరికీ ఇష్టమే. కాకపోతే.. ఎంత పెద్ద నటి అయినా, నటుడైనా - అలాంటి సందర్భం ఒకట్రెండు సార్లు వస్తుందంతే. అనుభవజ్ఞులైనా సరే, టేకుల మీద టేకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. ‘మీరెప్పుడైనా ఇలా టేకులు ఎక్కువ తీసుకొన్న సందర్భాలున్నాయా’ అని అనుష్కని అడిగితే ‘‘ఎందుకు లేవు..? నా తొలి చిత్రం ‘సూపర్’లోనే ఆ అనుభవం ఎదురైంది’ అని ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లింది. ‘‘ఓ పాటలో స్టెప్పు వేయడానికి చాలా ఇబ్బంది పడ్డా. సింపుల్ స్టెప్పే కానీ.. సరిగా అర్థం చేసుకోలేకపోయా. ఒకటికి పదిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ‘ఫర్లేదు.. మీరు చేయగలరు’ అంటూ సెట్లో ఉన్నవాళ్లంతా నావైపు జాలిగా చూశారు. అది ఇంకా భరించలేకపోయా. ఎవరైనా తిట్టినా ఫర్వాలేదు గానీ, అలా జాలిగా చూస్తే నాకు ఏడుపొచ్చేస్తుంది.అందుకే ఇంటికి వెళ్లి ఏడ్చేశా. అయితే ఇలాంటి అనుభవాలే రాటు దేల్చాయి. పరిశ్రమ ఎలా ఉంటుంది? ఇక్కడ వాతావరణం ఏంటి? అనే విషయాలు తెలియజెప్పాయి’’ అంది. #eenadupaper #eenadu #article











