హంసలా మారాలి!‘‘మంచీ చెడూ ఎక్కడైనా ఉంటాయి. మనం దేనివైపు నిలబడుతున్నాం అనేదే ప్రధానం’’ అంటోంది అనుష్క. ప్రస్తుతం ‘భాగమతి’లో నటిస్తోంది. 2018 జనవరిలో ఈ చిత్రం విడుదల అవుతుంది. అనుష్క మాట్లాడుతూ ‘‘పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా వూహించుకుంటుంటారు. అవన్నీ వూహలే అనను. అలాగని అవన్నీ నిజాలూ కావు. ఏ రంగంలో అయినా మంచీ చెడూ రెండూ ఉంటాయి. పాలు, నీళ్లు కలిపితే హంస పాలని మాత్రమే స్వీకరించగలదట. అలా మనం కూడా మారాలి. ఏది గ్రహించాలో, ఏది వదులుకోవాలో అనే విజ్ఞత మనకున్నప్పుడు చెడు గురించి భయపడడంలో అర్థం లేదు. ఓ సినిమా ఫ్లాప్ అయితే అంతా పోయినట్టు కాదు, ‘ఆ సినిమా ఎందుకు చేశానా’ అని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దాని ద్వారా కూడా నేర్చుకోగలిగే పాఠం ఏదో ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే మంచిది’’ అని హితబోధ చేస్తోంది. #Sweety in #Todays #eenadu #article #AnushkaShetty














