న్యూఢిల్లీ: మరో ఏడాదిలోపు ఇండియాలో టోల్ ప్లాజాలు మొత్తం ఎత్తేస్తామని, జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇప్పటి వరకూ దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వాడుతున్నాయని, మిగిలిన 7 శాతం వాహనాలకు రెట్టింపు టోల్ వేసినా ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదని ఆయన తెలిపారు. గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ ఈ విషయాన్ని చెప్పారు. దేశంలో ఏడాదిలోపే భౌతిక టోల్ ప్లాజాలను …












