TEENMAAR ANCHOR GOING TO BIGGBOSS HOUSE : తెలుగు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తయింది. రీసెంట్ గా ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ప్రోమోలో ముసలివాడి లుక్ లో కనిపించాడు నాగార్జున.
అయితే.. కంటెస్టెంట్లు ఎవరనే దానిపైనా చాలా లీకులు వస్తున్నాయి. పూనమ్ భజ్వా, శ్రద్దాదాస్, హంసా నందిని, సింగర్ సునీత, మంగ్లీ (సింగర్), హీరో నందు (గీతా మాధురి భర్త), వైవా హర్ష, అఖిల్ సార్దక్, యామినీ భాస్కర్, మహాతల్లి, అపూర్వ, పొట్టి నరేష్ ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్ పేర్లు చాలా వరకు ప్రచారంలో ఉన్నాయి.
బిత్తిరిసత్తికి కరోనా పాజిటివ్..!? అయినా పని చేస్తూనే ఉన్నాడు
వీరితో పాటు.. హాట్ యాంకర్లు విష్ణుప్రియ, మంజూషలు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లే కాదు.. ఇంకా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
అయితే.. వీరితో పాటు మరో అమ్మాయి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి కాలు పెట్టబోతోందని సమాచారం. తెలంగాణ నుంచి బిగ్ బాస్ సీజన్ 3లో శివజ్యోతి(తీన్మార్ సావిత్రి) హౌస్ లోకి వెళ్లింది. అయితే ఈ సారి తెలంగాణ నుంచి అదే తీన్మార్ వార్తల నుంచి వచ్చిన మరో అమ్మాయి బిగ్ బాస్ కు వెళ్తోందట.
దిల్ రాజు దంపతుల ప్రత్యేక పూజలు..
సుజాతగా వీ6 ప్రేక్షకులకు పరిచమైన శృతి.. బిగ్ బాస్ 4 సీజన్ వెళ్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం శృతి HMTV లో ప్రసారమయ్యే జోర్దార్ వార్తల్లో యాంకర్ గా చేస్తోంది. గతంలో శివజ్యోతి వెళ్లినట్టుగానే ఇప్పుడు శృతి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఇప్పటికే సెలక్షన్ ప్రాసెస్, అగ్రిమెంట్ కూడా పూర్తవడంతో..
Read the full article