రోడ్డు ప్రమాదం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడటం
తిరుపతి ఆంధ్రజ్యోతి ఎడిషన్‌లో సబ్ఎడిటర్ గా పనిచేస్తున్న పున్నంరాజు పల్లవి ప్రసాద్ ప్రమాదానికి గురయ్యారనే సమాచారం నన్ను చాలా ఆందోళనకు గురిచేసింది. ప్రసాద్‌తో పరిచయం తక్కువే కానీ..ఆయన జీవితంలాంటి నా జీవితం..నాలాంటి కొన్ని వేలమంది జీవితాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి.
అచ్చెన్న అరెస్ట్ సరే.. బాబుగారికి ఇంత భయమెందుకు..?
TRS, BJP కలిసి ఎంత బాగా డ్రామాలాడుతున్నాయో..!?
ట్రైనీ సబ్ ఎడిటర్, సబ్బెడిటరో, సీనియరో, చీఫో, ఎడిషన్ ఇన్చార్జో డెస్క్ లో ఉద్యోగం యమా రిస్క్. రిస్క్ అయినప్పుడు ఎందుకు చేయాలని చాలామంది అంటారు. మీ వాదనా కరెక్టే. వానపడి పంటపోతుంది. వానపడకా పంట ఎండిపోతుంది. వ్యవసాయం రిస్కే. కానీ రైతు మానేస్తున్నాడా? సబ్బెడిటరూ అంతే. చదివిన చదువులకు ఏ ఉద్యోగం రాక, ఏదో పత్రికకు రిపోర్టర్‌గా వుంటే బాగా రాయడం వల్ల కానీ, పరిస్థితులు బాగాలేకపోవడం వల్లకానీ డెస్క్‌కి పంపించడం వల్ల సబ్బెడిటర్ అనే ఉద్యోగం..యాజమాన్యం తీసేవరకూ, లేదా చచ్చేవరకూ చేయక తప్పదు.
నా మటుకు అయితే ఏ పనీ చేయరాదు. ఎలా బతకాలి అంటే..నాకు తెలిసింది ఇలా బతకడమే. అక్షరాల్ని కోయాలి. కొన్ని వార్తలకు అక్షరాలు అతికించాలి. కొన్ని ఆకులు రాలిన కొమ్మల్లాంటి కథనాలకు అక్షరాల ఆకులు మొలిపించి, కథనాలు పూలు పూయించాలి. ముసలమ్మలాంటి వార్తకు పడుచుపిల్లలాంటి హెడ్డింగ్ పెట్టాలి. ఇదంతా సాయంత్రం ప్రారంభమై అర్థరాత్రికి పూర్తికావాలి. రాత్రి నిద్రలేక, ఇచ్చే జీతం సరిపోక మళ్లీ మరో చోట పార్ట్ టైము ఉద్యోగాలు చేసేవారు ఆరోగ్యం చాలా తొందరగానే పాడైపోతుంది.
Read the full article