సినిమా హాల్లోకి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకెళ్లొచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మల్టీప్లెక్స్ సిబ్బంది ఆహారాన్ని తెచ్చుకునే వారిని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్ లలో తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. వాటిని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మహారాష్ట్ర మంత్రి రవీంద్ర చవాన్ తెలిపారు. త్వరలోనే తినుబండారాల రేట్లపై కూడా ఓ పాలసీని రూపొందిస్తామని, ఆరువారాల్లోగా ఆ పాలసీని …














