1000 స్తంభాల అద్భుతమైన గుడి! ఇలాంటి గుడిని కట్టడం సాధ్యమా?
Hey guys, ఈ రోజు మనం భారతదేశంలో ఉన్న విచిత్రమైన పురాతన ప్రదేశాలలో ఒకదానిని చూడబోతున్నాం, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే వేయి స్తంభాల గుడిలో ఉన్నాను, ఇది కనీసం 750 సంవత్సరాల పురాతనమైన గుడి. దీన్ని మొదటి చూపులో చూడడానికి, ఇది ఒక సాధారణ గుడి లాగ కనిపిస్తుంది, కానీ, ఈ గుడిలో ఖచ్చితంగా ఏదో తేడా ఉంది, ఎందుకంటే ఈ గుడి గోడలలో ఉన్న రాతి దిమ్మెల మధ్య ఎటువంటి joints కనిపించడం లేదు చూడండి. ఇది చాలా పెద్ద గుడి, కానీ నేను ఈ నేల నుండి పైకి వెళ్ళినప్పుడు, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మీకు ఏవైనా joints కనిపిస్తున్నాయా?
ఈ గుడి మొత్తాన్ని, కైలాస గుడి లాగానే దీని మొత్తాన్ని, ఒక గట్టి రాయితో నిర్మించారా అని ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు, అయితే, నిజానికి దీన్ని, చాలా రాతి బ్లాకులతో నిర్మించారని archeologistలు confirm చేస్తున్నారు. 1300 A.D లో, ముస్లిం రాజు అల్లావుద్దీన్ ఖాల్జీ యొక్క సైన్యం ఈ గుడిని కూల్చడానికి ప్రయత్నించారు, మరియు వాళ్ళు నేల నుండి ఇంకా ceiling నుండి చాలా రాతి దిమ్మెలను బయటకు తీశారు, ఎందుకంటే వాటిని కూల్చివేయడం సులభమే, కానీ వాళ్ళు గోడలపై ఉన్న బ్లాక్‌లను మాత్రం కూల్చలేకపోయారు. మీరు నేలను చూస్తే, archaeology department వాళ్ళు వేసిన కొత్త రాతి పలకలను మీరు చూడవచ్చు, ఈ blockలు ఎలా looseగా connect అయ్యి ఉన్నాయో అని మీరే చూడవచ్చు.
మీరు modern day రాతి కట్టడాన్ని, పురాతన technique తో పోల్చినట్లయితే, modern technology చాలా ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఇక్కడ jointsను clearగా చూడవచ్చు. అల్లావుద్దీన్ ఖాల్జీ సైన్యం చేసిన విధ్వంసం మరియు దాడి నుండి ఈ గుడిని renovate archaeology department ప్రయత్నిస్తోంది. ఇప్పుడు, ఈ గుడికి 'వెయ్యి స్తంభాల గుడి' అని ఎందుకు పిలుస్తున్నారు? ఈ గుడిలో వెయ్యి స్తంభాలు లేవు అయినా దీనిని వెయ్యి స్తంభాల గుడి అని ఎందుకు పిలుస్తున్నారని, చాలా మంది visitors ఆశ్చర్యపోతున్నారు. ఈ గుడిని ఎందుకు ఈ పేరుతో పిలుస్తున్నారంటే, దీన్ని వెయ్యి రాళ్లతో తయారు చేశారు కాబట్టి.
కానీ లేపాక్షి దేవాలయం వంటి అత్యంత అధునాతన దేవాలయాలలో కూడా, దిమ్మెల మధ్య jointsకు స్పష్టమైన సాక్ష్యాలను చూడవచ్చు, కానీ ఈ గుడిలో అలంటి joints కనిపించవు. ఇందులో చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ blockలను join చేయడానికి సిమెంట్, మోర్టార్ లేదా జిగురు ఇటువంటివి ఏవి ఉపయోగించలేదు. చాలా శతాబ్దాలకు ముందు పురాతన నిర్మాణ దారులు అటువంటి అసాధారణ joints యొక్క స్థాయిని ఎలా సాధించారు? ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారు, ఇలాంటి గుడిని ఎలా నిర్మించారు? పురాతన నిర్మాణదారులు చాలా complex ఐన ఒక interlocking systemను ఇక్కడ ఉపయోగించారు, ప్రతి రాయి లోపల కనీసం 12 రకాల కట్స్ ఉంటుంది.
చాలా complexగా ఉన్న ఈ కట్స్ అన్ని ఆ జాయింట్స్ చేసిన ఏరియా యొక్క surfaceని అధిగమిస్తుంది, దాని వల్ల ఇక్కడ చాలా strong ఐన జాయింట్ ఏర్పడుతుంది. ఈ పనిని రెండు స్టోన్ బ్లాక్‌ల మధ్య చేయడం చాలా కష్టం, అయితే అన్ని వైపులా అనేక రాతి బ్లాకులను ఉపయోగించడం వల్ల, 4 లేదా 5 బ్లాక్‌లను కలిపి కనెక్ట్ చేయడానికి ఎన్ని కట్లు అవసరమో ఒకసారి ఊహించుకోండి. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇది చాలా అసాధారణమైన సాంకేతికత అని నాకు అనిపిస్తుంది. ఇది చెక్కపై చేయవచ్చు, కానీ చాలా శతాబ్దాలకు ముందు వాళ్ళు, పెద్ద రాతి బ్లాకులపై, ఈ cutsను ఎలా చేయగలిగారు? ఈ cuts చేయడం అనేది ఒక పక్క పెడదాం, కానీ ఈ joints కనిపించకుండా చేయడానికి, ఖచ్చితత్వం స్థాయిని advanced machinesతో మాత్రమే సాధించవచ్చు.
Joints కనిపించకుండా, ఒక పెద్ద గుడిని నిర్మించడం అనేది ఆదిమ సాధనాలతో అసాధ్యమని ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. పురాతన నిర్మాణ దారులు, ఈ రోజు లాగానే కట్టింగ్, డ్రిల్లింగ్ మరియు పాలిషింగ్ toolsను ఉపయోగించారా? అలా అయితే, ఈ గుడిలోనే, ఈ toolsకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? Modern డ్రిల్లింగ్ మరియు పాలిషింగ్ toolsను పోలి ఉండే ఈ చెక్కడం ఎలా ఉంటుంది? చాలా గుడులలో, మనం సాధారణంగా దేవతల చెక్కడాలను చూస్తాము, కానీ ఈ గుడిలో, శంఖు ఆకారంలో ఉన్న చెక్కడాలను, పొడవైన షాఫ్ట్‌తో కూడిన చారల పైభాగంతో చూస్తున్నాము, ఇది ఆధునిక tool bitల లాగానే ఉంది. ఈ శిల్పాలను ఈ రోజుల్లో ఉన్న టూల్ బిట్లను పక్కపక్కనే పెట్టి వాటితో పోల్చి చూస్తే.
వీటి మధ్య అసాధారణమైన similarity ఉందని మీరు ఒప్పుకోవాలి. ఇది coincidence ఆహ్, లేదా పురాతన నిర్మాణ దారులు, ఈ ఖచ్చితమైన ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను తయారు చేయడానికి, మనలాగే టూల్ బిట్లను ఉపయోగించారా? ఈ గుడిలో ఉన్న స్తంభాలను చూస్తే డ్రిల్లింగ్ యంత్రాలు ఉపయోగించినట్లు confirm చేస్తున్నాయి. ఈ స్తంభాలపై చాలా చిన్న రంధ్రాలు ఉన్నాయి చూడండి. నా friend, ఈ చిన్న రంధ్రాల ద్వారా దారాన్ని పంపడానికి చాలా కష్టపడుతున్నాడు, కానీ ఈ రంధ్రాలు ఆ దారం కంటే చాలా చిన్నవిగా ఉన్నాయి.
కానీ ఈ గుడిలో ఉన్న పూజారి నేను హెప్ల్ చేస్తానని మాకు హెప్ల్ చేస్తున్నారు, అతను thread కంటే చాలా సన్నగా ఉన్నదాన్ని ఒకటి తీసుకొని, ఈ రంధ్రాల ద్వారా పంపించారు చూడండి. ఈ చెక్కడాన్ని, drill bits కాదని మీరు అనుకుంటే, మరి ఈ స్తంభాలపై చెక్కిన ఈ చిన్న రంధ్రాలను ఎలా వివరించాలి? Joints ఉన్న ఈ మొత్తం గుడి నిర్మాణాన్ని మనం ఎలా వివరించగలము? వీటిని advanced machinesతో సృష్టించారా లేదా ఉలి మరియు సుత్తి వంటి సాధారణ సాధనాలతో సృష్టించారా?
- Praveen Mohan Telugu









