రాముని విల్లులో ఊహకు అందని రహస్యం! ఆశ్చర్యపరిచే పురాతన సాంకేతికత ఆధారాలు!
Hey guys, ఈ రోజు నేను రాముడి విల్లు మరియు బాణం గురించి నేను కనిపెట్టిన కొన్ని interesting ఐన వాటిని మీకు చూపించబోతున్నాను. ఇప్పట్లో కూడా, హిందువులు విల్లు మరియు బాణంతో సాధారణంగా కనిపించే రాముడిని పూజిస్తారు. రాముడు తన లక్ష్యాన్ని ఎన్నడూ కోల్పోలేదని, అతని బాణాలు ఒకే సమయంలో అనేక targetలను తాకుతాయని పురాతన భారతీయ గ్రంథాలు చెప్తున్నాయి, చివరి targetని కొట్టడానికి ముందు అతని బాణాలు 7 చెట్ల గుండా ఎలా వెళ్ళాయో అని ఈ చెక్కడంలో మనం చూడవచ్చు.
ఇది మాయమైన మంత్ర విల్లునా? లేకపోతే ఈయన ఒక advanced technologyను ఉపయోగించారా? ఇక్కడ విల్లు, బాణాలను పట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులను మీరు చూడవచ్చు. అవి విల్లు అని స్పష్టంగా తెలుస్తుంది, ప్రాచీన కాలంలో ఆదిమ ప్రజలు ఉపయోగించిన సాధారణమైన చెక్క విల్లులు లాగా చాలా simply గానే కనిపిస్తుంది. మళ్ళీ, మీరు మూడవదాన్ని చూడవచ్చు, కానీ బహుశా ఇవి సాధారణ బాణం విసిరే విద్యలు నేర్చుకునే వాళ్ళైయుండొచ్చు, ఎందుకంటే వాళ్ళ dress ని చూడండి, కేవలం నడుముకు మాత్రమే వస్త్రం వేసుకున్నారు, వేరే ఏ ఆభరణాలు లేవు.
వాళ్ళు సాధారణంగా ముందు వెళ్తున్న సైనికుల వెనుక ఒక alignment లో వెళ్తున్నారు. అయితే ఈ విల్లులను చూడండి.. విల్లుకు రెండు చివర్లలో విచిత్రమైన చక్రాలు ఉన్నాయి. ఇది crazy గా ఉంది కదా, మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు మనం విల్లులలో చక్రాలు లేదా క్యామ్లను ఉపయోగిస్తాము, వాటిని మనం కాంపౌండ్ బావ్స్ అని పిలుస్తాము. ఈ circles అన్ని smoothగా ఉండడం మీరు చూడవచ్చు, ఇప్పట్లో ఉన్న compound విల్లులపై ఉండే cam wheels లాగానే ఇది కూడా smooth గా ఉన్న ఒక circle గా ఉంటుంది.
ఇది చాలా interestingగా ఉంది ఎందుకంటే మీరు ఆన్లైన్లో కూడా search చేసి చూస్తే, కేవలం 50 సంవత్సరాలకు ముందు మాత్రమే USలో compound bow ని కనిపెట్టారని మీరు చూస్తారు. కానీ ఈ గుడి వెయ్యి సంవత్సరాల పురాతనమైనది, పురాతన కాలంలో స్థపతులు చక్రాలతో కూడిన కాంపౌండ్ విల్లులను ఎలా ఉపయోగించారని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. విల్లుపై చక్రాలు పెట్టడం వల్ల అది మరింత శక్తివంతంగా ఇంకా ప్రభావవంతంగా ఉంటుందని easyగా మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు మనుషుల effort ని అధిగమించడానికి కొన్ని mechanical equipment లను మనం ఉపయోగిస్తున్నాము.
అయితే అందుకేనా రాముడి విల్లు మరింత ప్రభావవంతంగా ఉండేది? రాముడు తన విల్లుకు చక్రాలు పెట్టి ఉపయోగించారా? ఇక్కడ నేను నిజంగా చాలా amazing ఐన విషయాన్నీ చూసాను. రాముడు మరియు అతని తమ్ముడైన లక్ష్మణుడు యొక్క కొన్ని పెద్ద శిల్పాలను నేను ఇక్కడ చూసాను, వాళ్ళ విల్లులు కొన్ని విచిత్రమైన వివరాలను చూపుతున్నాయి. First చూసినప్పుడు, వాళ్ళ విల్లులో చక్రాలు ఉన్నాయని నేను అనుకున్నాను, కానీ వాటిని దగ్గరగా పరిశీలించినప్పుడే, అవి చక్రాలు కాదు, gear లు అని నాకు అర్ధమైంది.
I mean ఇక్కడ చూడండి, gear వీల్ యొక్క దంతాలను చూడవచ్చు, విల్లుకు ఈ gear మెకానిజం attach అయింది. ఇది చాలా advanced అయిన పురాతన టెక్నాలజీ, ఎందుకంటే ఇప్పుడున్న విల్లులలో కూడా ఈ టెక్నాలజీ ను ఉపయోగించలేదు. కానీ 20 ఏళ్లలో అంటే 2040కి ముందే ఎవరైనా ఇలాంటి ఒక రకమైన విల్లును తయారు చేయడం ప్రారంభిస్తారు. అలాంటి విల్లును ఏమని పిలుస్తారని అనుకుంటున్నారు? “Pull-Back Bow" ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, కదా? ఎందుకంటే ఈరోజు మన దగ్గర పుల్ బ్యాక్ కార్లు ఉన్నాయి.
చిన్నప్పుడు మన అందరి దగ్గర బొమ్మ కార్లు ఉంటాయి, అవి ముందుకు పోవాలని అనుకుంటే మనం వాటిని ముందుకు నెట్టుతాము, వెన్నకి వెళ్లాలంటే వెనక్కి నెట్టుతాము. కానీ అప్పుడు ఎవరో ఒకరు మనకు "పుల్-బ్యాక్ కార్" ని ఇచ్చారు, దానిని ముందుకు నెట్టడానికి బదులుగా, మీరు దానిని వెనక్కి లాగుతాము, అప్పుడు అది ఒక వింత క్లిక్ సౌండ్ చేస్తుంది కదా, మనం దానిని release చేసినప్పుడు, అది ఎంత వేగంగా ముందుకు పోతుందో అని మీకు గుర్తుంది. ఇదే రాముడు తన పురాతన విల్లులో ఉపయోగించిన పురాతన టెక్నాలజీ.
పుల్ బ్యాక్ కార్లలో బ్యాటరీలు లేదా ఇంకేదైనా ఉన్నాయని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఆ కారుని తెరిస్తే, లోపల మీకు రెండు గేర్లు, ఒక స్ప్రింగ్ కనిపిస్తాయి. అయితే, మనం దీన్ని టెక్నాలజీ కోసం ఉపయోగించినప్పుడు, మనం దానితో చాలా అద్భుతమైన విషయాలను చేయవచ్చు, గడియారాలు ఇంకా సైకిల్ లాంటి అనేక machines లలో ఈ technologyను ఉపయోగించవచ్చు. అయితే ఏదో ఒక రోజు, ఎవరో ఒకరు వచ్చి ఇది gear ఎహ్ కాదు, ఇవి కేవలం ఒక పువ్వు మాత్రమే అని వాదిస్తారు. అవునూ, మరి సైనికులు వాళ్ళ విల్లులపై పువ్వులు పెట్టి ఎందుకు ఉపయోగించారు?
మీరు ఏదైనా పువ్వును చూస్తే, దాని రేకులు పెద్దగా ఉంటాయి ఇంకా రేకులతో పోలిస్తే మధ్యలో ఉన్న భాగం చిన్నదిగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా gear ను తీసుకుంటే, మధ్య భాగం పెద్దదిగా ఉంటుంది, side లో ఉన్న gear ల పళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. exact గా దీనినే మనం ఇక్కడ ఈ శిల్పంలో చూస్తున్నాము. ఇప్పట్లో మనం ఉపయోగించే విల్లులో తీగలు ఉన్న విధంగానే ఈ పురాతన విల్లులో కూడా తీగలు ఉండడం మీరు చూడవచ్చు. మీరు ఆ gear ను చూసిన ప్రతిసారీ, దానికి తీగలు attach అయ్యుండడం మీరు చూడవచ్చు. విల్లులపై gearలు ఉన్న అన్ని శిల్పాలపై దీనిని మీరు చూడవచ్చు. లూసుగా ఉండే తీగలను ఇంకా ఇక్కడ ఉన్న ఈ నాట్లను కొంచం గమనించండి.
- Praveen Mohan Telugu










