చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలని కలిసింది | Singer Baby Meets S.Janaki | Peoplesposttv|
#Singerbaby #Sensationsinger #Babysingermeetsjanaki #SJANAKI #SingingLegend #Latestupdates #Peoplesposttv
చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలను కలిసింది. కొమ్మల్లో కోయిల ఎక్కడ ఉందో తెలియదు కానీ తీయ్యగా కూస్తుంది. అంతదూరం వెళ్లి ఆమని పాట వినే తీరిక ఆధునిక మానవునికి ఎక్కడిది! అందుకే.. ఆ మధ్య ఆన్ లైన్ లో ఓ కోయిల తియ్యగా కనబడుతూ కూసింది. అంతే!... యాంత్రిక జీవితంతో నానాయాతన పడుతున్న ఇప్పటి అర్ద రోబోలైన మనుషులకి అది ఎంతగానో నచ్చింది. అంతటితో ఆగలేదు ... మాములు మనుషులు దేవుళ్ళలా భావించే సినీ పెద్దల చెవికి ఆ గానం తాకింది... ఆ తర్వాత .... ఇంకా చెప్పాలా... ఆ కోకిల ఎక్కడుందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఆ గొంతు తగిలించుకున్న రూపానికి స్టార్ స్టేటస్ వచ్చేసింది. కమ్మగా పాడే ఆ గొంతు పేరు "బేబీ". ప్రస్తుతం ఆమె 'పల్లె కోకిల'గా ప్రసిద్ధికెక్కింది. చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలని కలిసింది | Singer Baby Meets S.Janaki | Peoplesposttv| ఓ చెలియా నా ప్రియ సఖియా..’ అంటూ గొంతు సవరించి సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్న మట్టిలో మాణిక్యం, పల్లెకోకిల బేబీ పేరు ప్రస్తుతం పట్టణాలు,నగరాల్లో కూడా మారుమోగిపోతుంది. ఆమెను కొద్దీ రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి పిలిచి ప్రశంసించి తనకు నచ్చిన పాటలు పాడించుకున్నారు. సతీసమేతంగా విని పరవశించుపోయారు మెగాస్టార్. చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలని కలిసింది | Singer Baby Meets S.Janaki | Peoplesposttv| ఇప్పుడు "గానకోకిల" జానకి కూడా ఈ పల్లెకోకిలను పిలిపించుకొని మనసారా ఆశీర్వదించి,"నీకు గొప్ప యోగం ఉందని. గొంతు అద్భుతమని,పల్లెటూరు దానినని,చదువు-సంధ్య లేదని అధైర్య పడవద్దు... అంతా మంచే జరుగుతుందని" శిష్య కోకిలకు గుండెనిండా ధైర్యం నింపింది. వయసెంతైనా అనుభవం దృష్ట్యా,గడించిన కీర్తి దృష్ట్యా చిన్నిదైనా ఈ కోకిల ఆ పెద్ద కోకిలను కలవడంతో తియ్యదనం రెండింతలైంది. చూపరులకు ఆనందం పదింతలైంది. తన జీవితంలో వరంలా దొరికిన ఈ రోజు మళ్లీ మళ్లీ వస్తుందో రాదో అని... అదే పాటను జానకి గారు ముందు బేబీ పాడి విన్పించింది. చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలని కలిసింది | Singer Baby Meets S.Janaki | Peoplesposttv| అందరు ఇండస్ట్రీకి రారు. కానీ కొందరు వాళ్లంతట వాళ్లే తీసుకురాబడతారు. ప్రేక్షకులని తమ గానంతోనో,నాట్యంతోనో,అభినయంతోనో ... కళ ఏదైనా తమ ప్రతిభ కౌశలంతో కట్టిపడేసే యోగం ఉన్నవాళ్లు వారు. అలా తెలుగు ప్రజల అదృష్టం తోసుకొచ్చి తీసుకురాబడిన వారిలో కే విశ్వనాథ్,సిరివెన్నెల సీతారామశాస్త్రీ,ఎస్.జానకి,సినారే మొదలైనవాళ్లు. వీళ్ళెవ్వరూ డైరెక్టుగా సినీపరిశ్రమకు రాలేదు,వేరే వాళ్ళు తీసుకొస్తే వచ్చారు. అలాంటి సంచలనం, పరిశ్రమ అక్కున చేర్చుకోగల అద్భుత ప్రతిభ పల్లెకోకిల బేబీ సొంతమని "పీపుల్స్ పోస్ట్" భావిస్తూ ఆమెకు 'ఆల్ ది బెస్ట్' చెప్తుంది. చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలని కలిసింది | Singer Baby Meets S.Janaki | Peoplesposttv| సంచలనమయ్యే దృష్టితో కాకుండా సరదాగా తన పాటను ఆన్ లైన్ లో పెట్టిన బేబీ గానానికి ప్రపంచ తెలువాళ్లంతా ముగ్దులవుతూ అరమరికలు లేకుండా అభినందిస్తున్నారు. Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost చిన్న కోకిల వెళ్లి పెద్ద కోకిలని కలిసింది | Singer Baby Meets S.Janaki | Peoplesposttv|

















