seen from China

seen from Kenya

seen from United States
seen from Maldives
seen from China

seen from Germany

seen from Germany
seen from China
seen from United States
seen from China
seen from United States
seen from United States
seen from Malaysia

seen from Kenya

seen from Malaysia
seen from China
seen from Kazakhstan
seen from United States
seen from Singapore
seen from Finland
కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మళ్లీ అదే ‘పాట’ పాడిన కత్తి! కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీరాముడిని అసభ్య పదజాలంతో దూషించిన కత్తి మహేష్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన 'టీవీ-9' చర్చా కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత పదజాలం వాడటంతో పాటు సీతాదేవి రావణుడితోనే ఉండి ఉంటే ఆమెకు న్యాయం జరిగి ఉండేదని తాను భావిస్తున్నానని కత్తి మహేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని బంజారాహిల్స్ పీఎస్‌తో పాటు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో, మహేశ్‌ను సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో.. శ్రీరాముడిపై కేవలం తనకున్న అనుకున్న అభిప్రాయాన్ని చెప్పానని.. రాజ్యాంగం తనకు ఆ హక్కు కల్పించిందని.. ఏ వర్గాన్ని కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని కత్తి మహేష్ తనను తాను గట్టిగా సమర్థించుకున్నట్లు తెలుస్తోంది.
టీవీ-9 కు సిగ్గు, శరం ఏమైనా ఉన్నాయా? వాటి కోసం టీవీ-9 ఈ స్థాయికి దిగజారింది!
#TV9, #Ramanananda టీవీ-9 కు సిగ్గు, శరం ఏమైనా ఉన్నాయా? వాటి కోసం టీవీ-9 ఈ స్థాయికి దిగజారింది!
‘టీవీ-9’ తెలుగు లీడింగ్ ఛానల్స్‌లో ఒకటి! ‘మెరుగైన సమాజం’ కోసం నిరంతరం ‘తపన’ పడిపోతూ ఎంతగానో కృషి చేస్తున్న ‘గొప్ప’ ఛానల్. జ్యోతిష్యం..వజ్రాలు, రత్నాలు, మూఢనమ్మకాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ‘ది గ్రేట్’ న్యూస్ ఛానల్! అనేక మంది బురిడీ బాబాల లోగుట్టును.. ఆధ్యాత్మికత ముసుగులో వారు చేస్తున్న అక్రమ వ్యాపారులను బయటపెట్టిన ఏకైక ఛానల్! అయితే, ఇంత ‘ఘనమైన’ ఛానల్ కూడా పైసలు వెదజల్లితే.. బురిడీ బాబాలను…
View On WordPress