#YSRCPMP #VijaySaiReddy మాపై ఆరోపణలు సరే... వెన్నుపోటు చూపిస్తారా? వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి టీడీపీ నేతలు వైఎస్ జగన్పై నిందారోపణలు చేయడంపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. టీడీపీ రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా తెలుసుకోవాలని.. వైఎస్ జగన్ ప్రజల మనసుల్లో ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని టీడీపీ మర్చిపోయిందని విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా తెలిపారు. చంద్ర బాబు రాజ్యంలో పోలవరం ఓ కల జగన్ అంటే టీడీపీ పాలనకు అంతం అని.. జగన్ అంటే పురోగతి, దార్శనికత, బాధ్యత, ఐక్యత, సానుభూతి, ప్రేమ, కరుణ అని ఉద్ఘాటించారు. ఇకనైనా చంద్రబాబు కళ్ళు తెరిచి చూడాల్సిన సమయం ఆసన్నమైందని, తాము అధికారంలోకి వస్తున్నామని విజయసాయిరెడ్డి సంపూర్ణ విశ్వాసాన్ని, ధీమాను వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ...బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్’ని చంద్రబాబు ఎలా వంచించారో, ఎలా వెన్నుపోటు పొడిచారో అనే అంశాన్ని నిజానిజాలతో చూపిస్తారా? లేదా? అని మరో ట్వీట్లో ప్రశ్నించారు వి.విజయసాయిరెడ్డి.