గుడిలో ఇలాంటి పాటర్న్ గమనించారా? విశ్వకర్మ సృష్టిని అర్థం చేసుకోవడం చాలా కష్టమే!
Hey guys, ఈ రోజు మనం కుడుమియాన్ మలై అనే మారుమూల గ్రామంలో ఉన్న ఈ శికనాథర్ ఆలయాన్ని చూడబోతున్నాం, ఈ గ్రామంలో ఉన్న అన్నిటికంటే ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో పూర్తిగా వివరించలేని మరియు ఒకదానికొకకటి సంబంధం లేని శిల్పాల వల్ల Expertsలు తికమక చెందుతున్నారు, అందుకు వాళ్ళు దీనిని unsolved puzzle అని పిలుస్తున్నారు. ఈ రోజు, నేను ఈ పజిల్ని పరిష్కరించడానికి ప్రయత్నించబోతున్నాను ఇంకా పురాతన నిర్మాణదారులు మరియు పురాతన శిల్పులు ఏం చేస్తున్నారో అని అర్థం చేసుకోవడంలో మీరు కూడా నాతో చేరాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో అనేక జంట శిల్పాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు.
ఉదాహరణకు, ఒకదానికొకటి ఎదురుగా చూస్తూ ఒకేలా ఉండే 2 కోతులు ఉన్నాయి చూడండి. ఒకేలా ఉన్న ఇద్దరు వీరులు ఒకరికొకరు చూస్తున్నట్టు నిలబడి ఉన్నారు. వీళ్ళ పక్కన అందమైన ఇద్దరు అమ్మాయిలు కూడా అదే విధంగా ఎదురుగా ఉండడం మీరు చూడవచ్చు ఇంకా అనేక ఇతర శిల్పాలు అదే పాటర్న్ లో ఉన్నట్టు మీరు చూడవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ ఆలయం మొత్తం కవల శిల్పాల సమూహంతో నిర్మితమైందనే సిద్ధాంతాన్ని కూడా మనం ఒప్పుకోలేము, ఎందుకంటే ఇతర ప్రదేశాలలో చూసుకుంటే, ఎదురుగా ఉన్న శిల్పాలు ఒకేలా లేకుండా ఉన్నాయి, మీరు ఒకదానికొకటి ఎదురుగా ఇలాంటి చెక్కడాన్ని చూడవచ్చు మరియు అవి ఒకేలా ఉన్న చెక్కడం కాదు మరియు అవన్నీ ఒకేలా కనిపించడం కూడా లేదు, ఇది కొంచం confuseగా ఉంది కదా.
మనం పక్కపక్కన చెక్కిన శిల్పాలను చూస్తే, అది మరింత గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణకు, మనం ఈ 100 స్తంభాల మండపంలోకి ప్రవేశించినప్పుడు, కుడి వైపున, నెమలిపైన కూర్చున్న కార్తికేయ అని పిలువబడే ఈ అందమైన ఆరు తలల దేవుడిని మీరు చూడవచ్చు. ఆ పక్కనే, సింహం తలతో ఉన్న నరసింహుడు ఒక రాక్షసుడిని చంపడం మీరు చూడవచ్చు. మొదటి చెక్కడానికి మరియు రెండవ చెక్కడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. అలానే మీరు ఎడమ వైపున చూస్తే, మీరు ఇలాంటి వాటినే చూస్తారు, ఇక్కడ ఏనుగు ముఖాన్ని కలిగి ఉన్న గణేశుడు ఉన్నాడు, మరియు ఆయన పక్కనే, 10 తలలతో ఉన్న రావణుని అద్భుతమైన చెక్కడాన్ని మీరు చూడవచ్చు.
మరియు ఈ విగ్రహాలకు ఎలాంటి connection లేదని చెప్పవచ్చు, దాదాపు చాలా మంది ప్రజలు ఆ విధంగానే ఆలోచిస్తారు. మరియు మీరు ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూఉ పోవచ్చు, ఉదాహరణకు రావణుడుకి మరియు అతని పక్కన ఉన్న ఈ స్త్రీ దేవత మధ్య ఎలాంటి సంబంధం లేదు అనే చాల మంది అనుకుంటారు. కాబట్టి, పూర్తిగా ఎలాంటి సంబంధం లేని దేవుళ్ళ శిల్పాలను వరుసగా ఇలా ఉండడం ఏ హిందూ దేవాలయంలోనూ కనిపించదు, మీరు చూడరు కూడా. పురాతన ఆలయాలలో మాత్రమే కాదు, ఇప్పట్లో కొత్తగా కట్టిన ఆలయాలలో కూడా ప్రక్క ప్రక్కనే ఉన్న శిల్పాల మధ్య ఒక connectivity ఒక సంబంధం ఉంటుంది.
I mean, మీరు ఒక సినిమాని continues గా సీన్ బై సీన్ చూసే విధంగా అన్ని శిల్పాలను సాధారణంగా చూడగలగాలి. వాళ్లు కేవలం ఇక్కడ, అక్కడ చెక్కిన శిల్పాలను తీసుకొచ్చి పెట్టలేదు, దీని వెనుక ఏదో ఒక లాజిక్ గాని కారణం గాని ఉండాలి. ఈ ఆలయంలో పూర్తిగా సంబంధమే లేని అనేక శిల్పాలు ఉండడం వల్ల, experts రాకుండా ఉండడమే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి రావడం మానేశారు, అంటే మీకు ఒక స్థలం నచ్చలేదంటే అక్కడికి మీరు పోరు, ఇదే మనిషి యొక్క ధోరణి. దీని కంటే మోసమైన విషయమేంటంటే, పురాతన శిల్పులు సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా ఈ శిల్పాలను చెక్కారు అని కూడా చెప్తారు.
అయితే ఇది పురాతన శిల్పుల యొక్క తప్పు కాదు, ఇది మన తప్పు ఎందుకంటే మనం జాగ్రత్తగా చూడటం లేదు, ఇంకా నిజం చెప్పాలంటే మనం వాళ్ళ కంటే తెలివైన వాళ్ళుము కాదు, smart ఐన వాళ్ళుము కూడా కాదు. అయితే మనం ఇప్పుడు పురాతన శిల్పుల మెదడులోకి వెళ్లి ఆలోచించడానికి ట్రై చేద్దాం రండి, మీరు ఆలయంలోని ఈ భాగంలోకి ప్రవేశిస్తున్నామని అనుకుందాము, మీరు చూసే మొదటి దేవుడు, వినాయకుడు అని అనుకుందాం. అయితే మీరు ఎదురుగా చూశారంటే, నెమలిపై కూర్చుని ఉన్న ఈ వినాయకుడి సోదరుడైన కార్తికేయుని చూస్తాము. Connectivity అంటే ఇదే; ఈ విధంగానే శిల్పాలను ఒకదానికొకటి ఎదురుగా ఉన్నట్టు అమర్చి పెట్టారు. కొంతమంది expertsలు ఈ pattern ను గమనించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, కానీ వాళ్లు ఈ 2 శిల్పాలను చూసినప్పుడు, ఈ theoryని వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండవచ్చు.
ఎందుకని చెప్పండి, ఇక్కడ మీరు 10 తలల రాక్షసుడు అనే పిలువబడే రావణుని మీరు చూడవచ్చు, దానికి ఎదురుగా, విష్ణువు యొక్క అవతారమైన సింహం తలల దేవుడిని అంటే నరసింహుని మనం చూడవచ్చు. రావణుడి, నరసింహకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చాలా మంది expertsలకు పురాతన భారతీయ గ్రంథాలను గురించి తెలియదు, అందువల్లే ఈ రెండు శిల్పాల మధ్య ఎలాంటి సంబంధాన్ని వాళ్లు చూడలేకపోయారు. ఒక రాక్షసుడిని మరియు విష్ణువు అవతారంతో ఉన్న దేవునితో ఎందుకు పోలుస్తున్నారు? వీరిద్దరిలో అత్యంత శక్తిమంతుడు ఎవరు?
మరి ముఖ్యంగా, వీళ్లిద్దరికీ మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఆ సంబంధమే ఈ రాక్షసుడు అనే connecting factor, ఇతని పేరు హిరణ్యకశిపుడు, విష్ణువు యొక్క అవతారమైన నరసింహ ఈ హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నాడు. ఈ హిరణ్యకశిపు రాక్షసుడు వేసుకున్న చెవిపోగులను రావణుడు ఎత్తలేకపోయాడని పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. కానీ రావణుడు ఈ రాక్షసుడి చెవిపోగులను కూడా ఎత్తలేకపోయాడు అయితే ఈ రాక్షసుడిని విష్ణువు నాశనం చేస్తారు. కాబట్టి, రావణుడితో పోల్చినప్పుడు విష్ణువు ఎంత పెద్దవాడో మరియు శక్తిమంతుడో అని మనకు చెప్పడానికి ఈ శిల్పాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచబడ్డాయి.
- Praveen Mohan Telugu
















