గ్రహాంతరవాసుల టెక్నాలజీతో కట్టిన ఎల్లోరా గుహ! ధ్వంసం చేసే వారిని సంహరించే గ్రహాంతర దేవాలయం!
Hey guys, ఇది ఎల్లోరాలోని world famous కైలాస temple. ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని ఎవరు కట్టుంటారో అని ఈ రోజు మనం చూద్దాం.. ఈ వీడియొ చూశాక, మన హిస్టరీ మొత్తం ఎంత తప్పుగా ఉందని, ఈ గుడిని కట్టింది ఒక ఉన్నవాళ్లు అని మీరు కూడా ఒప్పుకుంటారు.. ఈ గుడిలో అంతా స్పెషల్ ఏముంది అంటారా? ఈ గుడిని స్టోన్ blocks ఒక దాని పై ఒకటి పేర్చి కట్టలేదు కానీ, మొత్తం కొండనే చెక్కి ఈ గుడిని కట్టారు. ఈ ప్రపంచం మొత్తం లోనే ఇలా ఒక కొండ పైనుంచి చెక్కబడిన ఏకైక గుడి ఇది ఒక్కటే.
ఈ ప్రపంచం లోనే ఇతర గుళ్ళు, గుహలు, ఇక్కడే ఉన్న ఇతర ఎల్లోరా గుహలు, అన్నీ కూడా ముందు నుండి చెక్కుతూ వెళ్ళినవి. ఈ ప్రపంచం మొత్తం cut- in-monolith అంటే ముందు నుండి అలానే లోపలికి చెక్కే techniqueనే follow చేస్తుంది, కానీ కైలాస గుడిni మాత్రమే కచ్చితమైన వీటన్నిటికి భిన్నంగా cut-out-monolith అనే ప్రక్రియ తో చెక్కారు. ఈ రాక్ కటింగ్ టెక్నిక్ ఎందుకు చాలా భిన్నంగా ఉందంటే, 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఈ స్తంభాన్ని చూస్తే తెలుస్తుంది.
దీనితో కంపేర్ చేస్తే మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో చూడండి.. మామూలుగా ఇలాంటి పెద్ద స్తంభాన్ని create చేయడానికి, ఒక పెద్ద రాయిపై కచ్చితమైన చెక్కడం కోసం కొన్ని ఏళ్లుగా పని చేయాల్సి ఉంటుంది కదా! కానీ ఈ పిల్లర్ ని కొండ చుట్టూ ఉండే రాతి ముక్కలని తీసి చెక్కారు.. ఎంత రాతిని తొలగిస్తే ఈ పిల్లర్ తయారయ్యిందో ఊహించండి! ఇదే ఆలోచనతో historians ఇంకా archaeologist లు కూడా చాలా confuse అయ్యారు..4 లక్షల టన్నుల రాతిని తొలగించి ఉండవచ్చు అనీ, ఇంకా ఇది కట్టడానికి సంవత్సరాలు కాదు శతాబ్దాలు పడుతుందని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు.
మన historians దగ్గర ఈ కష్టమైన పనికి సంబంధించిన records ఏమి లేవు. కానీ ఈ గుడిని 18 ఏళ్లలో కట్టటం పూర్తి చేసి ఉంటారని వారు అనుకుంటున్నారు.. వీళ్ళు చెప్పింది నిజమేనా అని తెలియడం కోసం మనం ఇప్పుడు ఒక కాల్కులేషన్ చేసి చూద్దాం, ఎలాంటి breaks లేకుండా, ప్రతిరోజూ 12 గంటల పాటు, పద్దెనిమిదేళ్ళు, జనం పని చేశారని అనుకుందాం. వర్షాలు, పండుగలు, యుద్ధాలు, ఇవేమీ ఆలోచించకుండా, రోబోట్స్ లాగా ఆగకుండా పని చేశారనే అనుకుందాం. చిక్కుపడిన చెక్కడాలు, కష్టమైన ఇంజినీరింగ్ design, ఆ planning కి పట్టే సమయాన్ని కూడా వదిలేద్దాం, ఈ రాతిని తొలగించే సమయాన్ని మాత్రమే ఫోకస్ చేద్దాం.
నాలుగు లక్షల(400,000) టన్నుల రాతిని 18 ఏళ్ళలో తొలగించారు అంటే, 22,222 టన్నుల రాతిని, ప్రతి సంవత్సరం తొలగించి ఉండాలి. అంటే ప్రతి రోజు 60 టన్నుల రాతిని తొలగించారని అర్థం, so ప్రతి గంటకీ ఐదు టన్నుల రాతిని తొలగించారు అన్నమాట, ప్రతి గంటకు ఒక కొండ నుండి 5 టన్నుల రాయిని తొలగించడం ఈ రోజుల్లో కూడా సాధ్యం కాదని మనమందరం ఒప్పుకోవాలని నేను అనుకుంటున్నాను. మన దగ్గరున్న, so-called అడ్వాన్స్డ్ మెషీన్స్ ని పెట్టి, ఇప్పటి రోజుల్లో కూడా కుదిరే పని కాదు, ఇది మనుషుల వలన సాధ్యం కాకపోతే, దీన్ని మనుషులే కట్టారా? మరి అప్పుడు మనుషుల వల్ల కాకపోతే ఇది ఎవరు చేసి ఉంటారు, గ్రహాంతరవాసుల మేధస్సుతో దీన్ని క్రియేట్ చేసి ఉంటారా?
సరే ఇప్పుడు, ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ ని కట్టడం గురించి మర్చిపోండి, మనుషులు దీన్ని కనీసం నాశనం అయినా చేయగలరా? నిజానికి, ఔరంగజేబు అనే ఒక ముస్లిం రాజు, ఈ గుడిని పూర్తిగా కూల్చివేయడానికి 1000 మంది కార్మికులను పెట్టాడు. 1682 లో, అతను ఈ గుడిని నామరూపాలు కూడా లేకుండా పూర్తిగా నాశనం చేయాలనీ order వేసాడు. మూడేళ్ల పాటు వెయ్యిమంది ఇక్కడ పని చేశారని, కానీ వాళ్ళు చాలా తక్కువ నష్టాన్ని మాత్రమే చేయగలిగారని రికార్డులు చూపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని విగ్రహాలను మాత్రమే డ్యామేజ్ చేశారు, కానీ పూర్తిగా డ్యామేజ్ చేయడం సాధ్యమయ్యే పని కాదని వాళ్లకి అర్థమైంది, చివరికి ఇక చేసేది లేక ఔరంగజేబు అసాధ్యమైన పనిని వదిలేశాడు.
ఇదే విధంగా ఇంకొక విధ్వంసమే ఈజిప్ట్‌లోని ‘The Menakaure’s pyramid’ కి కూడా జరిగింది. ఇంకో ముస్లిం రాజు ఈ pyramids అన్నిటినీ నాశనం చేయాలని అనుకోని, తన పనిని Menkaure’s pyramid నుండి start చేసాడు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఆ పిరమిడ్ కి ఒక సొట్ట మాత్రమే పెట్టగలిగారు. ఆ తర్వాత ఆ పని కూడా చేయలేక వదిలేశారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ నాశనం చేయలేని కట్టడాలన్నీ గ్రహాంతరవాసులు కట్టినవేనా? అందుకే మనుషులు వాటిని నాశనం చేయలేకపోతున్నారా? infact ఎల్లోరా కేవ్ కాంప్లెక్స్ క్రియేట్ అవ్వకముందే కైలాస టెంపల్ కట్టబడినట్టుగా archeologistలు ఒప్పుకుంటున్నారు.
అసలు ఈ చెక్కడాలన్ని మొదలుపెట్టడానికి మనుషులు శతాబ్దాలకు ముందే ఈ కైలాస గుడిని క్రియేట్ చేసి ఉంటారా? అందుకే మనుషుల మేధస్సుకి అందనంత అద్భుతంగా, అందంగా, పెద్దగా ఈ గుడిని డిజైన్ చేయగలిగారా? ఒక వేళ మనుషులే దీన్ని కట్టి ఉంటే రోజురోజుకి ఈ రాక్ కటింగ్ టెక్నిక్ డిజైన్స్ ఇంకా మెరుగయ్యి ఉంటాయి. ప్రజలు మరింత అనుభవం and నాలెడ్జ్ ని పొందేవారు, ఇంకా భవిష్యత్తులో మెరుగైన కట్టడాలు నిర్మించి ఉండేవారు కదా. కానీ, ఈ కైలాస గుడి మాత్రమే ఇప్పటికి కూడా చాలా పురాతనమైనది అలానే ఇంజినీరింగ్ perfection తో చెక్కిన అతిపెద్ద గుడి. మిగతా గుడిల లాగా కాకుండా, ఈ గుడి పైన ఆకాశం నుండి చూసిన చాలా clearగా కనిపిస్తుంది.