పుట్టినరోజు సందర్భంగా కల్యాణ్ దేవ్ రెండు చిత్రాల విశేషాలను చెప్పారు. రమణతేజ దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కిన్నెరసాని’. రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ‘కిన్నెరసాని’ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
Kinnerasani Movie 2021: Kalyaan Dhev Kinnerasani Movie Motion Poster















