ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవర్ని వదలడం లేదు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికీ సోకుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది.
తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదికి కరోనా సోకింది.. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.గురువారం నుంచి ఒంట్లో నలతగా అనిపిస్తున్నట్టు ట్విటర్లో తెలిపారు.
TRS, BJP కలిసి ఎంత బాగా డ్రామాలాడుతున్నాయో..!?
అచ్చెన్న అరెస్ట్ సరే.. బాబుగారికి ఇంత భయమెందుకు..?
https://twitter.com/SAfridiOfficial/status/1271720209657630720
కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఆఫ్రిది చాలా మంది పేద వాళ్లకి తనవంతుగా సాయం చేస్తూ వస్తున్నాడు.. తన బృందంతో కలిసి చాలా గ్రామాలు తిరుగుతూ నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించాడు. షాహిద్ ఆఫ్రిది కరోనా నుంచి కోలుకోవాలని క్రీడా అభిమానులు కోరుకుంటున్నారు.
2018 లో లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్రిది ప్రకటించాడు. అఫ్రిది పాకిస్తాన్ తరఫున 398 వన్డేలు, 27 టెస్టులు, 99 టి20లు ఆడాడు.
ఇప్పటికే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లకు కరోనా సోకింది. పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ కరోనా వైరస్ నుండి సురక్షితంగా బయటపడ్డాడు. అంతకు ముందు పాకిస్థాన్ దేశవాళీ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫ్రాజ్ కరోనా వైరస్‌తో మృతి చెందాడు.
మంత్రి హరీష్ రావు పీఏకి కరోనా…
పాకిస్తాన్ లో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి..ఆ దేశంలో ఇప్పటి వరకు లక్ష ముప్పై రెండు వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 2600కి చేరింది.
మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి!
Read the full article