శ్రీలంకలో రావణుడి పెద్ద సింహాసనం దొరికింది? సిగిరియాలో పురాతన గ్రహాంతర వాసులు!
Hey guys, ఈ రోజు నేను మీకు రావణుడి సింహాసనాన్ని చూపించాలని అనుకుంటున్నాను, అవును, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదే శ్రీలంకలో ఉన్న రావణుడి సింహాసనం. ఇది ఒక సాధారణమైన రాయి అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ దీని పైన చూడండి, dheenni మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ రాయి పైభాగం మొత్తం cut చేసి, దానిపై రావణుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి, దీనిని పూర్తిగా flatగా చేశారు. ఇది చాలా పాతకాలంలో తయారు చేసిన, ఒక బ్రహ్మాండమైన stone work. దీనిని దూరం నుండి చూస్తే, ఇది ఒక పెద్ద వెన్న బంతిలా కనిపిస్తుంది, అలానే దీని పైభాగం చూస్తే ఒక వెన్న బంతిని సగంగా ఎలా cut చేస్తారో అలా ఉంది.
బహుశా, flatగా ఉన్న ఈ పైభాగం, దానికై అదే తయారయినదని కూడా మీరు అనుకోవచ్చు. ఇక్కడ, ఈ బండరాయి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి, so మనం దీని పైకి వెళ్లి రావణుడి సింహాసనంలో ఏముందో అని చూద్దాం రండి. ఇది naturalగా ఇలానే ఉండేదా, లేదా ఎవరైనా దీన్ని ఇలా artificialగా cut చేసి పెట్టారా? మీరేం అనుకుంటున్నారు...? దీన్ని, toolsని use చేసి, artificialగానే చేశారనడంలో, ఏ ఒక సందేహం లేదు. ఇది కచ్చితంగా naturalగా తయారైంది కాదు. ఈ floor ని చూడండి ఎంత smoothగా ఉందొ కదా, దీన్నిచూస్తుంటే, పాతకాలపు పాలిషింగ్ machinesని ఉపయోగించి బాగా పాలిష్ చేసినట్టు ఉంది.
మీరే కొంచెం ఆలోచించి చుడండి, ఒక రాయిని సగంగా cut చేసి అందులో ఉన్న చెత్తను, మన్నును clean చేయడం అనేది ఒక విషయం కానీ, ఈ రాయి పైభాగాన్ని ఇంత అద్భుతంగా పాలిష్ చేసి తయారు చేయడం సాధారణ విషయం కాదు. అంతే కాకుండా ఇది ఒక పెద్ద బండరాయి, కదా? మీరు, నన్ను చూడండి అలానే ఈ రాయిని చూడండి, ఈ రాయి ఏ sizeలో ఉంది, నేను ఏ sizeలో ఉన్నానో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఈ రెండిటిని పోల్చితే, ఈ రాయి ఎంత పెద్దగా ఉందొ మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, చాలా perfectగా ఉన్న ఒక rectangleను ఈ floor పైన cut చేశారు, అలానే దాని చుట్టూ ఈ holesలను కూడా చెక్కారు.
ఈ holesలను ఇక్కడ చెక్కడానికి కారణం ఏంటీ? అక్కడ చూడండి, చివర్లో ఒక విచిత్రమైన structure కనిపిస్తుంది కదా, అక్కడే వేలాది సంవత్సరాలకు ముందు రావణుడు కూర్చునేవాడు. ఇదే ఆయన సీటు, నేను దీనిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఇది ఎంత పెద్దగ ఉందో కదా. ఈ సీటు దాదాపు పది అడుగుల పొడవు ఉంది, ఇది నా bed కంటే చాలా పెద్దది, నాకు దీని పైన చాలా హాయిగా నిద్రపోవాలని ఉంది. ఇది చూడడానికి చాలా intrestingగా ఉంది, అయినా రావణుడికి ఇంత పెద్ద సింహాసనం ఎందుకు అవసరమైంది? ఎందుకంటే, రావణుడు ఒక పెద్ద రాక్షసుడు అని పాతకాలపు గ్రంథాలలో ఉంది, అతను మన లాగ ఐదు లేదా ఆరు అడుగుల పొడవు కాదు, అతను దాదాపు పది లేదా పదిహేను అడుగుల పొడవు ఉంటాడు అని చెప్తున్నారు కదా.
ఒకవేళ అతనికి ఇంత పెద్ద chair అవసరమైయుండొచ్చు, నేను ఈ పెద్ద chair పక్కన చాలా చిన్నగా కనిపిస్తున్నాను కదా! రావణుడి chairలలో ఇది కూడా ఒకటి అని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు, ఇది సిగిరియాలో ఉంది, దీనిని లయన్ రాక్ అని కూడా పిలుస్తారు, ఈ మొత్తం placeని కొంతమంది రావణుని కోట అని కూడా చెప్తున్నారు. నేను సిగిరియా గురించి చాలా రహస్యమైన విషయాలను తెలుసుకున్నాను అందులో కొన్నిటిని మీకు చూపించాను కూడా, అంతే కాకుండా కొన్ని విచిత్రమైన లక్షణాలతో ఉన్న రావణుని రాక్స్ ని గురించి కూడా తెలుసుకున్నాను, అది తర్వాత చూద్దాం. ఇక్కడ శ్రీలంకలో విచిత్రమైన ఒక పాతకాలపు techniqueని చూస్తున్నాము.
అది ఏంటంటే, పాతకాలపు స్థపతిలు, ప్రకృతిని ఇంకా వాళ్ళ స్వంత సృష్టిని ఒక అందమైన మార్గంలో కలుపుతున్నారు. ఇది ఇక్కడే naturalగా ఏర్పడి, ఉన్న ఒక బండరాయి, దీనిని సగంగా cut చేసున్నారు. కానీ, ఈ పైభాగంలో ఉన్న ఈ సీటు మాత్రం, రాయితో తయారు చేయలేదు. నిజానికి చెప్పాలంటే, అసలు ఇది రాయే కాదు, deenini ఇటుక, పాతకాలపు సున్నపు కలవ ఇంకా బంకమట్టి ఇవన్నీ కలిపి తయారు చేశారు. ఇప్పుడు experts దీని గురించి ఏం చెప్తున్నారో చూద్దాం? శ్రీలంకలో 'రావణ వథ' అనే ఒక పాతకాలపు గ్రంథం ఉంది, అందులో సిగిరియా అనే ఈ placeని రావణుడే ఉపయోగించాడు అని clearగా చెప్పారు కానీ, archeologistలు, historiansలు రావణుడు అనే వ్యక్తి నిజమైన మనిషే కాదు, అలాంటి ఆయన అసలు లేనే లేడు అని చెప్తున్నారు.
నిజానికి చెప్పాలంటే, ఇవన్నీ అసలు హిందూ నిర్మాణాలే కావు అని వాళ్ళు చెప్తున్నారు, కాశ్యప అనే ఒక బౌద్ధ మతం రాజే ఇదంతా కట్టారని వాళ్ళు చెప్తున్నారు, ఈ రాయి, ఆ బౌద్ధ మతం రాజు యొక్క audience hall అంటే ప్రేక్షకుల మండపం అని చెప్తున్నారు. అంతే కాకుండా ఇదంతా కట్టి కేవలం పదిహేను వందల(1500) సంవత్సరాలు మాత్రమే అయిందని archeologistలు ఇంకా historiansలు చెప్తున్నారు, కానీ ఇక్కడున్న ప్రజలు, ఇది అంతకు మించి, చాలా సంవత్సరాలకు ముందే కట్టారని చెప్తున్నారు.
కానీ, ఒకటి మాత్రం నిజం, ఇది పాతకాలంలో రాక్ కట్టింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఒక అద్భుతమైన సింహాసనం అని మనం ఒప్పుకోవాలి. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక పెద్ద బండరాయిని సింహాసనం లాగ మార్చి, అలానే కూర్చోవడానికి కొంత placeని కూడా తయారు చేసి, చూస్తుంటే బహుశా ఇది రాజుగారి కోసం నాట్య మందిరం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి రావణ రాజు ఇక్కడ కూర్చొని కొన్ని నాట్య ప్రదర్శనలు చూస్తాడు.
- Praveen Mohan Telugu











