ఎంత... ఎంతా!! ఎంత సంపాదిస్తున్నావు? ఇదేనా మన మొదటి ప్రశ్న???? బంధాన్ని, బంధుత్వాన్ని కొనుకుంటున్నామా! మనల్ని మనం అమ్ముకుంటున్నామా?? శ్రీరామచంద్ర! ధర్మాత్ముడివి, దయగల రాజువి, విశ్వాసపాత్రుడువైన భర్తవి, గొప్ప కొడుకువి, మంచి అన్నవి అయిన నిన్ను.... మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించమని పూజించామే! ఈరోజున... మన అనుకున్న మనవాళ్లంతా చూసేది ధర్మము, దయా గుణము, గొప్ప మనసు కాదు! ఎంత... ఎంతా! ఎంత సంపాదించావు? ఎంత దాచుకున్నావు? మాకెంతిస్తున్నావు అని?? అంటే మంచి అనేది వేదాలు, శాస్త్రాలు, పుస్తకలవరకేనా స్వామీ? ఇది మా అజ్ఞానమా! స్వార్ధమా?? మమ్మల్ని ధర్మం వైపుగా నడిపించు స్వామీ శ్రీరామచంద్ర!🙏🙏 - విజయ్ కుమార్ గొర్లె https://www.instagram.com/p/Cb2Ki1moL73/?utm_medium=tumblr