శ్రీలంకలో దాగి ఉన్న రహస్య చరిత్ర !! ఒకే రాతితో చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద శాసనం?
Hey guys, నేను ఇప్పుడు శ్రీలంకలో పోలోన్నరువా అనే ఊర్లో ఉన్నాను. ఇది శ్రీలంక ఉన్న ఒక పాతకాలపు నగరం. ఇక్కడ రాయితో చేసిన చాలా పెద్ద stone artifact ఒకటి ఉంది. ఇది దాదాపు ఇరవై ఏడు అడుగుల పొడవు ఇంకా నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. గట్టిగా ఉన్న ఒకే గ్రానైట్ రాయిలో దీన్ని చేశారు. దీని గురించి ఆశ్చర్యమైన విషయాలు చాలా ఉన్నాయి, శ్రీలంక యొక్క archeologist లే దీని గురించి రహస్యమైన విషయాలను ఇంకా పూర్తిగా కనిపెట్టలేదు. అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రపంచంలోనే స్వేచ్ఛగా నిలబడి ఉన్న, ఒకే రాయిలో చేసిన చాలా పెద్ద ఏకశిలా రాయి.
దీని పైన నాలుగు వేల మూడువందల(4300) అక్షరాలను చెక్కారు. ఎనిమిది వందల(800) సంవత్సరాలకు ముందు దీన్ని చెక్కారు కానీ అందులో సగం అక్షరాలను ఇప్పుడు కూడా బాగా చదవగలము. ఈ రాయి యొక్క అసలైన పేరు ఎవరికీ తెలియదు కానీ, దీన్ని ‘గల్ పోత’ అని అంటారు, అంటే ‘రాయి పుస్తకం’ అని అర్ధం. కొన్ని సంవత్సరాలకు ముందు ఈ రాయిని expertsలు research చూసారు, ఇందులో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయని కనిపెట్టారు, అలాగే దీని పైన చెక్కిన చాలా అక్షరాలలో చిన్న metal traces అంటే లోహపు జాడలు ఉన్నాయని కనిపెట్టారు. ఈ రాయి పైన కరిగిన మెటల్ లోహాన్ని పోశారని కనిపెట్టారు.
కానీ, archeologist లకు ఆ కాలంలో ఎందుకు ఇలా చేశారని తెలియదు. పాతకాలపు స్థపతిలు, ఎందుకు ఒక పెద్ద రాయి పైన అక్షరాలతో చెక్కి దాని మీద కరిగిన metalని పోసుంటారు? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈ రోజు కనిపెట్టబోతున్నాం. దీనిని అర్ధం చేసుకోవడానికి పాతకాలపు స్థపతిలు ఏం చేశారో, అదేలాగా ఉన్న ఒక చిన్న modelని నేను తయారు చేయబోతున్నాను. ఈ red colourలో ఉన్న చెక్క ముక్కని ఆ పెద్ద గ్రానైట్ రాయి అని ఊహించుకోండి. ఇప్పుడు, నేను ఈ చెక్కపైన నా పేరును చెక్కాను, చూడండి ఆ రాయి పైన ఉన్న అక్షరాలు లాగానే ఇవి కూడా ఉన్నాయి కదా. అలా చెక్కిన తరువాత పాతకాలపు వాళ్ళు దానిపైన కరిగిన metalని పోసుంటారు, అది కొంత సమయం తరువాత గట్టిపడింది.
నేను మెటల్ లోహానికి బదులుగా, ఈ సిలికాన్ pasteను ఈ అక్షరాల పైన వెయ్యాలని అనుకున్నాను, అలానే అది ఆరిపోయి గట్టిగ అయినంత వరకు wait చేద్దాం. ఇప్పుడు ఆ రాయి పైన కరిగిన లోహాన్ని ఎందుకు పోశారు అనేది archeologist లకు తెలియదు కానీ, పాతకాలపు స్థపతిలు ఆ రాయిపైన కరిగించిన లోహాన్ని పోశారంటే ఏదైనా మంచి కారణం ఉండే ఉంటుంది. కొన్ని గంటల తరువాత చూస్తే, సిలికాన్ పేస్ట్ గట్టిగ అయింది, ఇప్పుడు దీన్ని నేను ఏంచేయాలి? అయినా మనకు ఏం అనిపిస్తుంది, ఈ చెక్కనుండి ఈ సిలికాన్‌ను వేరు చేసి అది ఎలా ఉందొ చూడాలనేగా అనిపిస్తుంది. ఇప్పుడు గట్టిగ అయిన ఈ సిలికాన్ block ను చూడండి, నా పేరు mirror imageగా అంటే అద్దంలో చూసినట్టు కనిపిస్తుంది కదా, ఈ అక్షరాలు చిత్రించిన విధంగా కొంచం ముందుకు వచ్చున్నాయి.
ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది, పాతకాలపు స్థపతిలు ఇదే చేశారు. ఇప్పుడు, next step ఏంటంటే, దీని పైన కొంచెం inkను పోసి, ఒక clothని పెట్టి గట్టిగ నొక్కినప్పుడు నా పేరు....actually నేనే నా పేరును ముద్రించ గలుగుతున్నాను. ఇప్పుడు గట్టిగా ఉన్న ఈ సిలికాన్‌ను, నేను రబ్బర్ స్టాంప్ లాగ ఎన్ని సార్లు అయినా ప్రింట్ చేయగలను, ఈ రోజులో ఈ టెక్నాలజీని block printing అంటారు. ఇప్పుడు కూడా మనము బట్టలపైన, చీరలపైన వీటిని ఉపయోగిస్తున్నాము. కానీ పాతకాలపు స్థపతిలు, ఈ ప్రింటింగ్ techniqueని, ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు నుండే ఎంత అద్భుతంగా ఉపయోగిస్తున్నారో చూడండి.
కరిగిన లోహాన్ని రాయిపైన పోసి, అది గట్టిగా అయిన తరువాత, ఆ మెటల్ ప్లేట్ బయటికి తీసి దాన్ని stampగా ఉపయోగించవచ్చు, ఇంకా దానిని ఉపయోగించి bannerలను and posterలను కూడా తయారు చేయొచ్చు, అలానే city చుట్టూ వాటిని పెట్టొచ్చు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రాయిపైన ఈ అక్షరాలను ఎందుకు చెక్కారు? అలానే directగా మెటల్ stampను ఎందుకు creat చేయలేదు. ఎందుకంటే, ఈ రాయిని ఒక మాస్టర్ టెంప్లేట్‌గా తయారుచేశారని అనుకుంటున్నా, దీని నుండి చాలా stampలను మనం తయారు చేయొచ్చు.
ఈ పెద్ద రాయిపైన, కరిగిన లోహాన్ని, పదే పదే పోయడం ద్వారా, solidగా ఉన్న plateలను మనం ఎన్ని సార్లు అయిన తయారు చేసుకోవచ్చు. ఈ మెటల్ ప్లేట్లు శ్రీలంకలో ఉన్న వివిధ placeలకు తీసుకొని వెళ్ళుంటారు, అక్కడ ఉన్న ప్రజలు పెద్ద పెద్ద బట్టలను బ్యానర్లుగా ఉపయోగించి, కొన్ని వేలాది బ్యానర్లను తయారు చేసారు, ఒకొక్క మూలల్లో వాటిని పెట్టారు. దీన్ని ఒక centralized template system అని చెప్పొచ్చు, ఒకవేళ విడిగా టెంప్లేట్ తయారు చేస్తే, spelling తప్పులు ఉన్నా grammer తప్పులు ఉన్నా ఇందులో వచ్చే అవకాశం అస్సలు లేదు.
నేడు ప్రభుత్వాలు, వాళ్ళ ప్రచారాల కోసం ప్రింటర్లను ఉపయోగిస్తున్నారు, ఇంకా ప్రజలను ప్రభావితం చేసుకోవడానికి అంటే వాళ్ళకి బాగా బ్రెయిన్‌వాష్ చేయడానికి ఇలా ప్రింట్ చేసిన విషయాలను అన్ని మూలల్లో, సందులలో పెడుతున్నారు. ఇప్పుడు, ఈ పాతకాలపు శాసనంలో ఏముందో చూద్దాం? ఇందులో కూడా ఎనిమిది వందల(800) సంవత్సరాలకు ముందు ఉన్న, ప్రభుత్వం యొక్క ప్రచారమే ఉంది. అది ఏంటంటే, రాజుని గౌరవించాలి ఇంకా అన్ని విధాలా రాజుని రక్షించాలి, అలానే రాజుకి వ్యతిరేకంగా వెళ్లినా లేదా అతని రహస్యాలను బయట పెట్టినా, వాళ్లకు మరణ శిక్ష విధించబడుతుందని ఉంది.
- Praveen Mohan Telugu















