మాజీ మంత్రి..టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కు మరోసారి సీఐడి నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళగిరి సిఐడి కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది. గురువారం మంగళగిరి సిఐడి కార్యాలయం లో తొమ్మిది గంటల పాటు సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమా ను అనేక ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ..సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు వీడియో మార్ఫింగ్ అభియోగాలపై […]













