గడిచిన ఈ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాల్లో...!!
వాక్చాతుర్యంతో సభను సైలెంట్ చేసిన మంత్రి, ముఖ్యమంత్రి
సభలో సరైన ప్రతిపక్ష నేత లేనిలోటు స్పష్టం
అసెంబ్లీని పార్టీ ప్రచార సభగా మార్చుకునే వ్యూహం
ఇంకా 20 యేండ్లు మేమే పాలించాలన్న కసి
మావి నీతులు.. వాళ్ళవి బూతులు అన్న చంధం
వన్ వే ఫోకస్.. దటీజ్ పవర్
అందరూ కారునే అనుసరించాలన్న తపన
ఓటమిని దరిదాపులకు కూడా రానివ్వకూడదన్న ఆలోచన
తెర వెనుక ఎదో జరుగుతోందని మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ గళంలో తత్తరపాటు
ప్రతిపక్ష నేతలు, పత్రికలు(ప్రెస్), అధికారులపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఇవన్నీ దేనికి సంకేతం...
మా ముఖ్యమంత్రి కేసీఆర్...
" ఏది పడితే అది మాట్లాడటానికి ఇది ఫ్లాట్ ఫామ్ కాదు శాసనసభ" అని గుర్తు చేశారు. ఇంకా రైతులు, సర్పంచ్ లు, మహిళలు, గిరిజనులు సంతోషంగా ఉన్నారని..అసలు డెంగ్యూ లేదన్నారు. పంచాయితీలు, పల్లెప్రగతి, ఉపాధి హామీ పథకం, గ్రామజ్యోతి, నిధుల కేటాయింపు గురించి ఒక రోజు మాట్లాడటానికి సమయం కావాలని గౌరవనీయులైన సభాపతిని కోరారు.
ఇక మా ఐటీ మంత్రి కేటీఆర్..
సమ్మిళిత అభివృద్ధి గురించి మాట్లాడారు, ప్రయివేటు సెక్టార్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో జరగని అభివృద్ధి ఈ ఏడేండ్లలో జరిగింది అన్నారు. కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను తుంగలో తొక్కిందని చెప్పారని.. ఈ నాలుగు రోజుల తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను గమనించిన సదరు సామాన్యులు అనుకుంటున్నారు.













