*అమ్మ* అవధులులేని మమకారాన్ని పంచేది అమ్మ, అమితమైన మధురానుభూతి అమ్మ, అచంచలమైన మనోస్ద్థైర్యం అమ్మ, అద్బుతమైన మహిమలమహిళ అమ్మ, అర్ధమయ్యే మహాభారతం అమ్మ, అపారమైన మమతలతల్లి అమ్మ, అంతుచిక్కని మేఘసందేసం అమ్మ, అందమైన ఆనందం అమ్మ, అలుపులేని అరవిందం అమ్మ, అసాధ్యసాధిని అమ్మ, అరిపించే మెరుపు అమ్మ, ఆశ్చర్యపరిచే మహామనీషి అమ్మ, అనంతవిశ్వంలో మమతలసర్వస్వం అమ్మ. కొత్త ఆవకాయలోని పరిమళం అమ్మ, గుత్తి వంకాయలోని ఘుమఘుమ అమ్మ, ఆవు పాలలోని స్వచ్ఛ్యత అమ్మ, నయాగారపు గాంభీర్యం అమ్మ, జీవితపు మాధుర్యం అమ్మ, చెప్పలేని అనుబంధం అమ్మ, వాడిపోని సుమగంధం అమ్మ, అలుపు సలుపు కనపడనివ్వకుండా మన గెలుపు తలుపు తీసిన అమ్మ, జీవితపు రంగులని పోపుల డబ్బాలోంచి తీసి జీవితాన్ని అందంగా రంగరించిన కళా"లక్ష్మి" అమ్మ, కోరిన కొరికలు తీర్చే కల్ప"వల్లి" అమ్మ, మన ఆశయాలను తనవిగా చేసుకునేది అమ్మ, మన విజయాన్నే తన విజయంగా భావించి, లాలించి, దీవించి, కాంక్షించి, గర్వించి, ఆనందించి, నిత్యం ప్రేమించేది అమ్మ. అమ్మే సత్యం, అమ్మే సర్వం, అమ్మే మనం, అమ్మే జయం, అమ్మే దైవం. - శ్రీనివాస రవితేజ :) 🙏 #SriWishes #Sriwrites #HappyMothersDay http://srinivasaravitheja.blogspot.com/2017/05/blog-post_13.html