#NBK100 #GPS #GautamiputraSatakarni బాలకృష్ణ 100 వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సెన్సార్ పూర్తిచేసుకుని రిలీజ్ కి సిద్ధం అయింది. చారిత్రాత్మక కథతో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపుపన్ను మినహాయించాయి. మంచి పాటలు, పదునైన మాటలతో క్రిష్ ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కనీసం 70 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 70 కోట్లపై వినోదపు పన్ను అంటే 15% లెక్కన 10 కోట్ల 50 లక్షలు అవుతుంది. ఈ కలెక్షన్లలో సగం తెలంగాణ నుంచి వస్తాయి అనుకున్నా, 5 కోట్ల రూపాయలు టాక్స్ కట్టాల్సి వస్తుంది. ఈ పన్ను మినహాయింపు వల్ల ఈ 5 కోట్ల రూపాయలు నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి అదనపు లాభం వచ్చినట్లే. కనీసం 50 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినా కూడా, 7. 5 కోట్లు టాక్స్ రూపంలో మిగిలినట్లే. సినిమాకి వచ్చిన పాజిటివ్ బజ్, బాలయ్య 100 వ సినిమా కావడం, పండుగ సీజన్లో రిలీజ్ అవుతుండటం తదితర కారణాల వల్ల శాతకర్ణి బిజినెస్ భారీగా జరిగింది. ఒక మంచి కథతో, రిస్క్ తీసుకుని మరీ శాతకర్ణి ని నిర్మించిన నిర్మాతలకి ఈ మాత్రం ప్రోత్సాహం లభించడం చాలా అవసరం. శాతకర్ణి స్ఫూర్తితో మన తెలుగు వీరులపై మరిన్ని సినిమాలు రావాలని కోరుకుందాం.