బుద్ధుడి చేతిలో ఎవరికీ తెలియని మేరు కొండ రహస్యాలు..! ఇది కేవలం విగ్రహం కాదు..! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం శ్రీలంకలో పురాతన నగరమైన పాలొన్నారువాలో వట్టదాగే అనే placeలో చాల అద్భుతమైన పురాతన structureలను చూడబోతున్నాము. ఈ place మొత్తం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం వరకు కూడా ఇది మొత్తంగా పాడుబడి దుమ్ము ధూళితో నే ఉన్నదీ. తర్వాత archeologistsలు ఈ placeని తవ్వినప్పుడు ఈ structureని కనిపెట్టారు. మీరు చూస్తున్న ఈ roundఐన structureని Sri Lankan architecture యొక్క శిఖరం అని చెప్పవచ్చు, ఇది ఇంచుమించు ఎనిమిది వందల సంవత్సరాలు పాతదై ఉంటుంది.
శ్రీలంక మొత్తం ఉన్న వాటికంటే చాలా అద్భుతమైన శిల్పాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడికి ఎక్కువ expertsలు touristsలు రావడానికి అందం మాత్రమే కారణం కాదు, ఇందులో ఇంకొక పురాతన రహస్యం దాగి ఉంది. Archeologists and historians అందరూ దీని లోపల ఏదో ఒక special ఐన విషయం పాతిపెట్టబడిందని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ బుద్ధుడి పన్ను పాతిపెట్టబడిందని చెప్తున్నారు. కొందరు ఏం అంటున్నారంట, లేదు ఇక్కడ బుద్ధుడి బిక్ష పాత్రను పాతిపెట్టిన స్థలం అని చెప్తున్నారు. ఇంకా కొందరు అవన్నీ కాదు ఇక్కడ ఆయన తల వెంట్రుకలను పాతిపెట్టారని చెప్తున్నారు.
అది ఏమై ఉన్నా సరే, కచ్చితంగా అది చాలా ముఖ్యమైనదైయుంటుంది. ఈ structure మొత్తం ఎందుకు ఇన్ని రోజులు మట్టిలో ధూళిలో పాతిపెట్టబడింది? పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఈ placeని తవ్వినప్పుడు archeologistsలు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించారు, ఈ place మొత్తాన్ని మట్టితో కప్పేసి ఎవరూ దీన్ని కనిపెట్టలేని విధంగా పాతి పెట్టారని చెప్తున్నారు. So, దీని కింద ఎం ఉన్నా కూడా, అది చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని చెప్తున్నారు. కానీ అది ఏంటి? ఒకవేళ ఈ బుద్ధుడి శిల్పంలో అది ఏంటనే clue మనకు దొరుకుతుందా...
ఈ structure లోపల నాలుగు బుద్ధుడి శిల్పాలు ఉన్నాయి, ఈ నాలుగు శిల్పాలు నాలుగు దిశలను చూపుతున్నట్టు ఉన్నాయి. బుద్ధుని చేతులు ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని బుద్ధుని శిల్పాలలో ఆయన చేతిలో ఏమి ఉండవు కాలిగా ఉంటాయి, కానీ ఈ శిల్పంలో ఆయన చేతిలో ఏదో ఒకటి విచిత్రంగా ఉంది. ఆయన చేతులు చుడండి. మీరు దాన్ని గమనించారా? ఏంటిదిది? ఒకవేళ శిల్పి ఈ శిల్పాన్ని చెక్కేటప్పుడు mistack చేశారేమో, కానీ కాదు... ఇది ఇంకొక శిల్పం, ఇక్కడ ఈయన చేతులను కూడా చుడండి.
ఇక్కడున్న నాలుగు బుద్ధుడి శిల్పాలు ఇలానే ఉన్నాయి. ఈయన కచ్చితంగా ఏదో ఒక పత్రాన్ని చుట్టి చేతిలో పెట్టుకొని ఉన్నారు. బాగా clearగా తెలుస్తుంది చుడండి, అది ఒక clothతో నైనా లేకపోతే paperతో నైనా చుట్టిన ఒక cylindrical roll లాగా ఉంది. ఇది నిజంగానే ఒక అద్భుతమైన అన్వేషణ, పాతకాలపు బుద్ధుడి శిల్పాలలో ఇలాంటి scrollలను పట్టుకొని ఉండడం మామూలు విషయం కాదు. మనం normal గానే ఎం అనుకుంటామంటే బౌద్ధ మతం కేవలం ధ్యానం, meditation గురించి నేర్పించే ఒక మతం అని మనం అనుకుంటాము. కానీ పురాతన బౌద్ధ మతంలో చాలా విచిత్రమైన రహస్యాలు ఉన్నాయి, అందులో చాలా advanced అయిన technological పరికరాల గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఆ scroll లోపల ఏం ఉంది?
బుద్ధుడు ఎందుకు దాన్ని చేతిలో పట్టుకొని ఉన్నారు? ఒకటి గుర్తుంచుకోండి, పాతకాలపు సమూహాలన్నీ రూపక చిత్రాలను ఒక clueగా use చేసారు, అందువల్లే పాతకాలపు స్థపతిలు అక్షరాలకు బదులుగా ఆకారాలను, రూపాలను చెక్కారు. ఈరోజుల్లో కూడా ఇంచుమించు మనం అదే చేస్తున్నాము. కొన్ని ముఖ్యమైన placeలలో అందురు easyగా అర్ధం చేసుకోవాలని అక్షరాలకు బదులుగా ఆకారాలను మనం use చేస్తున్నాము. కాబట్టి ఈ scrollలో ఎం రాసి ఉందని తెలుసుకోవడానికి సరియైన clue కచ్చితంగా ఈ placeలోనే ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్టారని first చూద్దాం. శ్రీలంకలో చాలా స్తూపాలను అంటే చాలా బౌద్ధ గుడులను చూడవచ్చు, అవన్నీ చూడడానికి పెద్దగా bell లాంటి structureలో ఉంటాయి.
అయినప్పటికీ ఈ వట్టదాగేని ఒక కొత్త design తో కట్టబడింది. మనం బయటనుండి చూస్తే, ఇది roundగా ఉన్న ఒక design లాగ తెలుస్తుంది కానీ పైనుండి top వ్యూలో చూస్తే మనకు ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. దీన్ని మన కళ్ళతో చూస్తుంటే ఇది ఒక complex అయిన technical diagram లాగ కనిపిస్తుంది కానీ ఇది చూడడానికి ఇంచుమించు మేరు శిఖరం లాగనే ఉంది. ఇప్పుడు, mount Meru అంటే మేరు శిఖరం అంటే ఏంటి? బౌద్ధ మతం ఇంకా హిందూ మతం ప్రకారం చూసుకుంటే, మనం శారీరకంగా జీవిస్తున్న భౌతిక మరియు ఆధ్యాత్మిక విశ్వాలను తెరవడానికి అవసరమైయే తాళం ఈ మేరు శిఖరంలో ఉన్నదని వీళ్ళ నమ్మకం.
దీని baseని చుడండి, ఒక తాబేలు baseలాగ ఉంది, ఇంకా పైన pyramid లాంటి ఒక structure ఉంది. అలాగే మీరు ఈ వట్టదాగే యొక్క mapని చూస్తే, అది కూడా చూడడానికి తాబేలు లాగనే కనిపిస్తుంది. ఇంకా archeologistsలు మేరు శిఖరం లాంటి ఒక structure దీని పైన కట్టబడిందని కచ్చితంగా చెప్తున్నారు. ఒకవేళ బుద్ధుడి చేతిలో ఉన్న ఈ scrollలో మేరు శిఖరం గురించి ఏవైనా రహస్యాలు ఉన్నాయా? మరీ ముఖ్యంగా, ఇక్కడ ఈ scrollనే నేలమట్టంలో పాతిపెట్టారా?మేరు శిఖరం గురించి ఇంకా చాలా information ఇచ్చే బౌద్ధ మత scrollsని మనం ఎక్కడని వెతకాలి? ఇదెలాంటి పురాతల గ్రంధాలన్నిటిని రహస్యంగా చైనాలో ఉన్న మొగావ్ గుహలలో తీసుకుకెళ్లి పెట్టారు. అప్పుడు, అక్కడున్న బౌద్ధ మత సన్యాసిలు ఆ scrollsలను వేరే వేరే గుహలలో దాచి పెట్టేసారు.